news18-telugu
Updated: November 24, 2020, 4:57 PM IST
వీడియో గేమ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఆఫర్... రూ.7 లక్షలు గెలుచుకునే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)
గేమింగ్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన పబ్జీపై భారత ప్రభుత్వం ఇటీవల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దక్షిణ ఆసియాలోని ప్రముఖ ఎస్పోర్ట్స్ సంస్థగా ప్రసిద్ది చెందిన ‘నోడ్విన్ గేమింగ్’, తన మొట్టమొదటి కాల్ ఆఫ్ డ్యూటీ టోర్నమెంట్‌ను ప్రకటించింది. పబ్జీ మొబైల్‌పై నిషేధం విధించిన తర్వాత గేమింగ్ టోర్నమెంట్లో అత్యంత జనాదరణ పొందింది ఈ బ్యాటిల్ రాయల్ గేమ్. పబ్జీకి ప్రత్యామ్నాయంగా వచ్చిన ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ గేమ్ బ్యాటిల్ రాయల్ గేమ్ లవర్స్‌కు గొప్ప ఎంపికగా చెప్పవచ్చు. ఈ గేమ్ ఇప్పుడు ‘మొబైల్ ఇండియా ఛాలెంజ్–2020’ పేరుతో ఒక మొబైల్ టోర్నమెంట్‌ను కూడా నిర్వహించనుంది. దీనికి గాను నవంబర్ 20వ తేదీనే రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. ఈ టోర్నమెంట్లో నెగ్గిన వారికి రూ.7 లక్షల బహుమతులు అందజేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. నోడ్విన్ గేమింగ్‌కు చెందిన యూట్యూబ్, ఫేస్బుక్ హ్యాండిల్స్‌లో కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు నోడ్విన్ గేమింగ్ తెలిపింది.
Mobile Apps: వెంటనే ఈ 5 యాప్స్ మీ ఫోన్ నుంచి డిలిట్ చేయండిRedmi: మీరు కొన్న రెడ్మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా
ఈ టోర్నమెంట్‌పై నోడ్విన్ మేనేజింగ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు అక్షత్ రథీ మాట్లాడుతూ ‘‘ఈ టోర్నమెంట్లో పాల్గొనే గేమర్స్ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి గొప్ప వేదికగా పనిచేస్తుంది.’’ అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ టోర్నమెంట్లో నమోదు చేసుకోవడానికి, పాల్గొనడానికి అందరికీ అవకాశం ఉంటుంది. 5v5 టోర్నమెంట్, బాటిల్ రాయల్ మోడ్ల కోసం మొత్తం నలుగురు విజేతలను ఎంపిక చేస్తారు. దీనికి గాను మొత్తం రూ. 6,48,000 విలువ చేసే బహుమతులను అందజేస్తారు. కాగా, ఈ రెండు మోడ్లలో నెగ్గిన విజేతలు డిసెంబర్ 28న జరగబోయే గ్రాండ్ ఫైనల్ సెట్‌కి వెళతారు.
Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Prepaid Plans: రూ.300 లోపు రీఛార్జ్ చేయాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే
గేమింగ్ ప్రపంచంలో అత్యంత ప్రజాదారణ పొందిన పబ్జీ గేమ్ ఇండియాలో బ్యాన్ అయిన నేపథ్యంలో ‘పబ్జీ మొబైల్ ఇండియా’ పేరుతో మరో యాప్ విడుదలకు సన్నాహాలు చేస్తుంది పబ్జీ గేమింగ్ సంస్థ. భారతదేశానికి చెందిన గేమర్స్ కోసమే ప్రత్యేకంగా ఈ మొబైల్ గేమ్‌ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ యూజర్లను పెంచుకోవడానికి ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ సరికొత్త టోర్నమెంట్‌ను నిర్వహిస్తోంది. టోర్నమెంట్లో పాల్గొనాలనే ఆసక్తిగల వారు నోడ్విన్ అధికారిక వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, భారతీయ మొబైల్ గేమర్స్ కోసం నూతనంగా విడుదల కానున్న ‘పబ్జీ మొబైల్ ఇండియా’ ఎప్పుడు ప్రారంభించబడుతుందో ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కాని ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి రానున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
Published by:
Santhosh Kumar S
First published:
November 24, 2020, 4:57 PM IST