హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Refurbished Smartphones: ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు.. తక్కువ ధరకే లభిస్తున్న ప్రీమియం మోడల్స్

Refurbished Smartphones: ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ ఫోన్లపై స్పెషల్ ఆఫర్లు.. తక్కువ ధరకే లభిస్తున్న ప్రీమియం మోడల్స్

మీరు ఇన్‌స్టాగ్రామ్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) మీరు డబ్బులు సంపాదించొచ్చు.  ఈ ఫీచర్ తొలిసారిగా అమెరికాలో లాంఛ్ అయింది. దశలవారీగా ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఆ తర్వాత ఇతర దేశాల్లోని యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందించనుంది. ఈ ఫీచర్ గురించి ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. 
(ప్రతీకాత్మక చిత్రం)

మీరు ఇన్‌స్టాగ్రామ్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) మీరు డబ్బులు సంపాదించొచ్చు. ఈ ఫీచర్ తొలిసారిగా అమెరికాలో లాంఛ్ అయింది. దశలవారీగా ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది ఇన్‌స్టాగ్రామ్. ఆ తర్వాత ఇతర దేశాల్లోని యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందించనుంది. ఈ ఫీచర్ గురించి ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో వివరించింది. (ప్రతీకాత్మక చిత్రం)

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ ఐఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 6, 6s, 6s ప్లస్, ఐఫోన్ SE, ఐఫోన్ 7, ఐఫోన్ 8లను బడ్జెట్ ధరలో సొంతం చేసుకోవచ్చు.

ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో(Flipkart) అన్ని రకాల వస్తువులు సేల్‌కు అందుబాటులో ఉంటాయి. అయితే కొత్త ప్రొడక్ట్స్‌తో పాటు రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్లకు(Smartphones) కూడా ఫ్లిప్‌కార్ట్(Flipkart) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్‌(Technical Problems) ఉన్న, రిపేర్‌కు వచ్చిన డివైజ్‌లను(Device) కంపెనీ స్వయంగా రిపేర్ చేసి, కొత్త ఫోన్(Phone) కంటే తక్కువ ధరలో అందిస్తుంది. వీటిని రీఫర్బిష్డ్ ఫోన్లు(Phones) అంటారు. ఇలాంటి స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఫ్లిప్‌కార్ట్‌లో మళ్లీ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ ఐఫోన్లు, ఇతర ఆండ్రాయిడ్ ఫోన్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 6, 6s, 6s ప్లస్, ఐఫోన్ SE, ఐఫోన్ 7, ఐఫోన్ 8లను బడ్జెట్ ధరలో సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు రెడ్‌మీ, మోటొరోలా, శామ్‌సంగ్ వంటి ఇతర బ్రాండ్ల రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కొత్త ఫోన్ల మాదిరిగానే పనిచేస్తాయి. క్వాలిటీ చెక్ ప్రాసెస్ తర్వాతే సంస్థ వీటిని కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇలాంటి యూజ్డ్ ఫోన్లు 47 క్వాలిటీ చెక్స్ తర్వాత ఫ్లిప్‌కార్ట్‌లో లిస్ట్ అవుతాయి. ప్రస్తుతం ఈ కేటగిరీలో అందుబాటులో ఉన్న కొన్ని రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లు ఏవో చూద్దాం.

Samsung Tab: శామ్‌సంగ్ నుంచి మరో కొత్త ట్యాబ్ లాంచ్.. గెలాక్సీ ట్యాబ్ S6 లైట్ ధర, ఫీచర్ల వివరాలు..


* యాపిల్ ఐఫోన్ 6ఎస్ (Apple iPhone 6s)

రీఫర్బిష్డ్ గోల్డ్ కలర్ వేరియంట్ యాపిల్ ఐఫోన్ 6ఎస్, 64GB మోడల్ కేవలం రూ.10,899కి అందుబాటులో ఉంది. ఇది టచ్ ఐడీతో 4.7 అంగుళాల రెటినా డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 5MP సెల్ఫీ లెన్స్‌తో పాటు 12MP రియర్ కెమెరాతో వస్తుంది. iPhone 6sలో A9 చిప్‌సెట్ ఉంది. 16GB ఐఫోన్ 6s ధర రూ.9,999గా ఉంది. సిల్వర్, స్పేస్ గ్రే కలర్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కేటగిరీలో ఐఫోన్ 6 సిరీస్ ఫోన్లు కూడా లభిస్తున్నాయి.

* యాపిల్ ఐఫోన్ 7 (Apple iPhone 7)

ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ యాపిల్ ఐఫోన్ 7 కేవలం రూ.14,529కి అందుబాటులో ఉంది. ఇది ఐఫోన్ 8లో ఉన్న ఫీచర్లతో లభిస్తుంది. కెమెరాలు, స్క్రీన్ సైజ్‌ ఒకేలా ఉంటాయి. అయితే ఇది A10 ఫ్యూజన్ ప్రాసెసర్‌తో వస్తుంది.

* గూగుల్ పిక్సెల్ 3 XL (Google Pixel 3 XL)

64GB RAM ఉన్న రీఫర్బిష్డ్ గూగుల్ పిక్సెల్ 3 XL ఫోన్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.13,999గా ఉంది. పిక్సెల్ 3 XL ఫోన్ 6.3 అంగుళాల QHD+ డిస్ప్లే, 12.2MP రియర్ కెమెరాతో వస్తుంది. ఇది డ్యూయల్ 8MP సెల్ఫీ లెన్స్‌లతో ఆకట్టుకుంటుంది. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3,430mAh బ్యాటరీ కెపాసిటీ దీని సొంతం.

* పిక్సెల్ 3a (Pixel 3a)

64GB మోడల్ రీఫర్బిష్డ్ పిక్సెల్ 3a స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10,789 వద్ద లభిస్తోంది. ఇది 5.6 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో వస్తుంది. పిక్సెల్ 3 XL ఫోన్‌లో ఉండే రియర్ లెన్స్‌తో అందుబాటులో ఉంటుంది. అయితే సెల్ఫీల కోసం ఒక 8MP సెన్సార్ మాత్రమే ఉంది. 3,000mAh బ్యాటరీ, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 670 చిప్‌సెట్‌ వంటివి దీని స్పెసిఫికేషన్లు.

First published:

Tags: 5g technology, Mobile phone, Technology

ఉత్తమ కథలు