Home /News /technology /

REFURBISHED PHONES FLIPKART BUMPER OFFER ON REFURBISHED PHONES UP TO 76 PERCENT DISCOUNT ON THOSE MODELS ALL AT ONCE GH VB

Refurbished Phones: రీఫర్బిష్డ్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఆ మోడళ్లపై ఏకంగా 76 శాతం డిస్కౌంట్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లను అతి తక్కువ ధరకే అందిస్తోంది. రీఫర్బిష్డ్ ఐఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఏకంగా 76% వరకు డిస్కౌంట్‌ ప్రకటించింది.

వాల్‌మార్ట్(Walmart) యాజమాన్యంలోని ఈ-కామర్స్(E Commerce) ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్(Flipkart) స్మార్ట్‌ఫోన్లను(Smartphone) అతి తక్కువ ధరకే అందిస్తోంది. రీఫర్బిష్డ్ ఐఫోన్లు(Refurbished iPhone), ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లపై(Android Smartphones) ఏకంగా 76% వరకు డిస్కౌంట్‌(76 Percent Discount) ప్రకటించింది. తక్కువ ధరలో ఏదైనా ఫోన్‌(Phone) కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు(Costumers) ఆన్‌లైన్ సేల్‌(Online Sale) తక్కువ ధరకే బెస్ట్ మోడళ్లను(Best Models) సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం యాపిల్ (Apple), ఎమ్‌ఐ (Mi), Google కంపెనీలతో పాటు ఇతర బ్రాండ్‌ల రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్ అందిస్తోంది.

రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లు అంటే.. ఇతర యూజర్లు ఇంతకు ముందు కొనుగోలు చేసి ఉపయోగించిన డివైజ్‌లు అని కస్టమర్లు గమనించాలి. ఏదైనా బ్రాండ్ నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ పాడైపోయినప్పుడు, ఆథరైజ్డ్ సర్వీస్ పర్సన్స్‌తో వాటిని రిపేర్ చేయించి రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్‌గా అమ్ముతుంటారు. ఫ్లిప్‌కార్ట్‌ ఇలాంటి డివైజ్‌ల కోసం కొన్నిసార్లు స్పెషల్ సేల్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ బ్రాండ్లకు చెందిన రీఫర్బిష్డ్ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ సేల్‌కు సిద్ధం చేసింది. నాణ్యతను ధ్రువీకరించిన తర్వాతే ఇలాంటి స్మార్ట్‌ఫోన్లను అమ్మనున్నట్లు ఫ్లిప్‌కార్ట్‌ చెబుతోంది. ఈ ఫోన్లపై మూడు లేదా ఆరు నెలల వారంటీని కూడా అందిస్తుండటం విశేషం.

ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న స్మార్ట్‌ఫోన్ల జాబితా

Apple iPhone 7
రీఫర్బిష్డ్ యాపిల్ ఐఫోన్ 7 (Apple iPhone 7) బ్లాక్ కలర్, 32 GB వేరియంట్‌పై ఫ్లిప్‌కార్ట్‌ 76% డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో డివైజ్ కేవలం రూ.14,499కే లభిస్తోంది. 4.7 అంగుళాల రెటినా HD డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఐఫోన్.. A10 ఫ్యూజన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Moto G22: రూ.10,000 లోపు బడ్జెట్‌లో మోటో జీ22 రిలీజ్... ఫీచర్స్ ఇవే

Google Pixel 3 XL
రీఫర్బిష్డ్ Google Pixel 3 XL (64GB) మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్ రూ. 13,999కి విక్రయిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో పాటు 4 GB RAMతో పనిచేస్తుంది. ఈ డివైజ్ డ్యుయల్ 8MP సెల్ఫీ లెన్స్‌లు, 12.2MP బ్యాక్ కెమెరాతో వస్తుంది.

Apple iPhone 6s
ఫ్లిప్‌కార్ట్‌లో రీఫర్బిష్డ్ Apple iPhone 6s (32GB) కేవలం రూ. 11,999కే లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4.7-అంగుళాల రెటినా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డివైజ్‌ 12MP బ్యాక్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Android Apps: ఈ 6 యాప్స్ చాలా డేంజర్... కలకలం రేపుతున్న మాల్‌వేర్

Mi Redmi Note 6 Pro
రీఫర్బిష్డ్ ఎమ్‌ఐ రెడ్‌మీ నోట్ 6 ప్రో (Mi Redmi Note 6 Pro) ధరను ఫ్లిప్‌కార్ట్ రూ. 7,199గా నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.26 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేతో వస్తుంది. 4000 mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12MP + 5MP డ్యుయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 20MP + 2MP డ్యుయల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Iphone, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు