REEBOK ACTIVEFIT 1 0 PRICE IN INDIA RS 4499 LAUNCH SPECIFICATIONS FEATURES SMARTWATCH SALE AMAZON GH VB
Reebok ActiveFit 1.0: రీబాక్ నుంచి మొదటి స్మార్ట్‌వాచ్ లాంచ్.. అందుబాటు ధరకే ప్రీమియం ఫీచర్లు..
ప్రతీకాత్మక చిత్రం(Image Credit : Amazon)
ప్రముఖ స్పోర్టింగ్ గూడ్స్ బ్రాండ్ రీబాక్ తాజాగా స్మార్ట్‌వాచ్ మార్కెట్లోనూ అడుగుపెట్టింది. రీబాక్ తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రీబాక్ యాక్టివ్ ఫిట్1.0 పేరుతో దీన్ని లాంచ్ చేసింది.
ప్రముఖ స్పోర్టింగ్ గూడ్స్ బ్రాండ్ రీబాక్ తాజాగా స్మార్ట్‌వాచ్ (Smart Watch) మార్కెట్లోనూ అడుగుపెట్టింది. రీబాక్(Reebok) తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రీబాక్ యాక్టివ్ ఫిట్1.0 పేరుతో దీన్ని లాంచ్ చేసింది. 1.3 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే(Display) గల ఈ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ మానిటరింగ్‌తో పాటు బ్లడ్ ఆక్సిజన్ శాచురేషన్ (SpO2) మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రీబాక్ యాక్టివ్ ఫిట్1.0 స్మార్ట్‌వాచ్ 15 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. ఇది IP67 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ సర్టిఫికేషన్‌ను పొందింది. రీబాక్ స్మార్ట్‌వాచ్ గరిష్టంగా 15 రోజుల బ్యాటరీ లైఫ్(Battery Life), 30 రోజుల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందించగలదని కంపెనీ పేర్కొంది.
రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 ధర, లభ్యత..
కొత్త రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 భారతదేశంలో రూ. 4,499 ధర వద్ద లభిస్తుంది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ బ్లాక్, బ్లూ, నేవీ, రెడ్ అనే నాలుగు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం ఈ ధర మార్జిన్‌లోనే స్మార్ట్‌వాచ్‌లను విక్రయిస్తున్న అమేజ్‌ఫిట్, ఫైర్‌బోల్ట్, నాయిస్, రియల్మీ, జీబ్రానిక్స్ వంటి మిడ్‌రేంజ్ స్మార్ట్ బ్రాండ్లకు రీబాక్ గట్టిపోటీనివ్వనుంది.
రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 స్పెసిఫికేషన్లు..
రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 స్మార్ట్‌వాచ్ రౌండ్ షేప్ డయల్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.3 -అంగుళాల హెచ్డీ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. ఈ వాచ్ డస్ట్, స్ప్లాష్, వాటర్ రెసిస్టెన్స్‌కు మద్దతిస్తుంది. దీనిలో కాల్, మెసేజ్ నోటిఫికేషన్లతో పాటు సోషల్ మీడియా యాప్ నోటిఫికేషన్లు, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్స్, బిల్డ్ ఇన్ గేమ్ నావిగేషన్ వంటి ఫీచర్లను అందించింది. మరోవైపు, దీనిలో సైడ్-మౌంటెడ్ బటన్లను కూడా చేర్చింది.
బూస్ట్ ఫిట్ యాప్‌తో రీబాక్ యాక్టివ్ ఫిట్ 1.0 స్మార్ట్‌వాచ్‌లోని వాచ్ ఫేస్‌లను, డయల్ డిజైన్లను కంట్రోల్ చేయవచ్చు. ఇది iOS 9.0, అంతకంటే ఎక్కువ వెర్షన్లపై రన్ అవుతుంది. ఐఫోన్ హ్యాండ్సెట్లతో పాటు ఆండ్రాయిడ్ 5.0,అంతకంటే ఎక్కువ వెర్షన్లలో రన్ అయ్యే ఆండ్రాయిడ్ పరికరాలతో దీన్ని జత చేయవచ్చు. ఈ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌లో వాకింగ్, సైక్లింగ్, హైకింగ్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, రన్నింగ్, యోగా, స్కిప్పింగ్ వంటి 15 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందించింది. రీబాక్ యాక్టివ్ ఫిట్1.0 స్మార్ట్‌వాచ్‌లో హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ (SpO2), స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లను అందించింది.
ఈ స్మార్ట్ వాచ్ అలారం, స్టాప్‌వాచ్,సెడెంటరీ రిమైండర్లతో సహా ప్రైమరీ ఫీచర్లతో వస్తుంది. ఇక, మహిళల కోసం పీరియడ్ సైకిల్ ట్రాకింగ్ ఫీచర్‌ను కూడా అందించింది. ఈ వాచ్‌లో క్యాలరీ, స్టెప్ ట్రాకర్‌ను కూడా మద్దతిస్తుంది. ఇక, బ్యాటరీ విషయానికి వస్తే.. దీన్ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 15 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అదే సమయంలో 30 రోజుల వరకు స్టాండ్ బై టైమ్‌ను అందిస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.