హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smart Watches: రెండు లేటెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌లు లాంచ్‌ చేసిన రెడ్‌మీ.. ధర, ఫీచర్స్‌ వివరాలు ఇలా..

Smart Watches: రెండు లేటెస్ట్‌ స్మార్ట్‌వాచ్‌లు లాంచ్‌ చేసిన రెడ్‌మీ.. ధర, ఫీచర్స్‌ వివరాలు ఇలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షావోమీ అనుబంధ సంస్థ రెడ్‌మీ ప్రొడక్ట్స్‌కు ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తొలుత స్మార్ట్‌ఫోన్‌ తయారీకి పరిమితమైన రెడ్‌మీ బ్రాండ్‌ క్రమంగా ఇతర సెగ్మెంట్‌లకు విస్తరిస్తోంది. తాజాగా రెండు సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్స్‌ను చైనాలో లాంచ్ చేసింది. రెడ్‌మీ వాచ్ 3, రెడ్‌మీ బ్యాండ్ 2 పేరిట వీటిని తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

షావోమీ అనుబంధ సంస్థ రెడ్‌మీ ప్రొడక్ట్స్‌కు ఇండియన్‌ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. తొలుత స్మార్ట్‌ఫోన్‌ తయారీకి పరిమితమైన రెడ్‌మీ బ్రాండ్‌ క్రమంగా ఇతర సెగ్మెంట్‌లకు విస్తరిస్తోంది. ఇటీవల సరికొత్త ఫీచర్స్‌తో ఎలక్ట్రానిక్ డివైజ్‌లను లాంచ్ చేస్తోంది. హెల్త్ మానిటర్‌ ఫీచర్స్‌తో తాజాగా రెండు సరికొత్త ఫిట్‌నెస్ ట్రాకర్స్‌ను చైనాలో లాంచ్ చేసింది. రెడ్‌మీ వాచ్ 3, రెడ్‌మీ బ్యాండ్ 2 పేరిట వీటిని తీసుకొచ్చింది. వీటి ధరలు, స్పెసిఫికేషన్స్‌పై ఓ లుక్కేయండి.

రెడ్‌మీ బ్యాండ్ 2 స్పెసిఫికేషన్స్

Redmi బ్యాండ్ 2 స్మార్ట్‌వాచ్, 172×320 పిక్సెల్ రిజల్యూషన్‌తో 1.47-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లే‌తో లాంచ్ అయింది. ఇది 450 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్‌తో వచ్చే కాంపాక్ట్ స్మార్ట్ బ్యాండ్. ఈ స్మార్ట్‌వాచ్ 210mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 14 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది.

30 స్పోర్ట్స్ మోడ్స్‌ సపోర్ట్

రెడ్‌మీ బ్యాండ్ 2 వంద వరకు బ్యాండ్ ఫేస్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఫిక్చర్‌ను బ్యాండ్ ఫేస్‌గా సెట్ చేసుకోవచ్చు. ఈ డివైజ్ 30 స్పోర్ట్స్ మోడ్స్‌ను కూడా అందిస్తోంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్‌టెన్స్‌కి 5ATM సర్టిఫికేట్ కూడా పొందింది. ఈ డివైజ్ హార్ట్ రేట్‌ను కూడా మెజర్ చేయగలదు. స్లీపింగ్‌ను ట్రాక్ చేస్తుంది. పీరియడ్స్‌ సైకిల్‌ను కూడా మానిటర్ చేస్తుంది.

రెడ్‌మీ వాచ్ 3 స్పెసిఫికేషన్స్

ఈ స్మార్ట్ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్స్ ఉన్నాయి. ఇది బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ అయింది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో 1.75-అంగుళాల OLED స్క్రీన్‌తో లభిస్తుంది. ఇందులో 289mAh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 12 రోజుల బ్యాటరీ లైఫ్ వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 390×450 పిక్సెల్స్ నేటివ్ రిజల్యూషన్‌తో 600 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్‌తో బ్రైట్ డిస్‌ప్లే అందిస్తుంది. లార్జ్ డిస్‌ప్లే ఉన్నప్పటికీ, స్ట్రాప్‌తో కలిపి 37 గ్రాముల బరువు ఉంటుంది.

స్లీప్ ప్యాట్రన్స్ మానిటర్

రెడ్‌మీ వాచ్‌ 3 దాదాపు 121 స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ బ్యాండ్ 2 మాదిరి ఇది కూడా హార్ట్ రేట్, SpO2ను మెజర్ చేస్తుంది. స్లీప్ ప్యాట్రన్స్ కూడా మానిటర్ చేస్తుంది. ఇంప్రూవ్డ్ వర్క్‌ఔట్ ట్రాకింగ్ కోసం ఈ స్మార్ట్‌వాచ్ GPS, GLONASS, Beidou, QZSS, GALILEO వంటి నావిగేషన్ సిస్టమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

ధరల వివరాలు

రెడ్‌మీ బ్యాండ్ 2 స్మార్ట్‌వాచ్ ధర దాదాపు రూ.2,000 ఉంటుంది. ఇక రెడ్‌మీ వాచ్ 3ను రూ.7000కు సొంతం చేసుకోవచ్చు. ఇది రెడ్‌మీ వాచ్ 2 లైట్ కంటే కొంచెం ఖరీదైనది. Redmi K60 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో ఈ రెండు స్మార్ట్ వాచ్‌లు చైనాలో తాజాగా లాంచ్ అయ్యాయి. అంతేకాకుండా రెడ్‌మీ బడ్స్ 4 Lite పేరిట TWS ఇయర్‌బడ్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు కూడా కంపెనీ ప్రకటించింది. భారత్‌లో ఈ రెండ్ స్మార్ట్‌వాచ్‌లు ఎప్పుడు లాంచ్ అవుతాయో కంపెనీ ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.

First published:

Tags: Redmi, Smartwatch, Xiomi

ఉత్తమ కథలు