REDMI WATCH 2 LITE LAUNCHED IN INDIA CHECK OUT PRICES SPECIFICATIONS AND MORE GH VB
Redmi Watch 2 Lite: రెడ్మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌వాచ్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
షియోమి సబ్-బ్రాండ్ రెడ్మీ కేవలం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోనే స్మార్ట్ వాచ్ మార్కెట్లోనూ దూసుకుపోతుంది. ఇందులో భాగంగా తాజాగా రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లతో పాటుగా రెడ్మీ వాచ్2 లైట్ అనే సరికొత్త స్మార్ట్‌వాచ్‌ని కూడా విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
షియోమి(Xiomi) సబ్-బ్రాండ్ రెడ్మీ(Sub Brand Redmi) కేవలం స్మార్ట్‌ఫోన్(Smart Phone) మార్కెట్(Market) లోనే స్మార్ట్ వాచ్ మార్కెట్లోనూ దూసుకుపోతుంది. ఇందులో భాగంగా తాజాగా రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ స్మార్ట్ఫోన్లతో పాటుగా రెడ్మీ వాచ్2 లైట్(Lite) అనే సరికొత్త స్మార్ట్‌వాచ్‌ని కూడా విడుదల చేసింది. బెంగళూరులో జరిగిన రెడ్మీ ఫిజికల్ ఆఫ్‌లైన్(Off line) ఈవెంట్లో దీన్ని ఆవిష్కరించింది. రెడ్మీ వాచ్ 2 లైట్ సరసమైన స్మార్ట్‌వాచ్‌గా (Smart Watch) మార్కెట్లోకి వచ్చింది. దీనిలో బడ్జెట్ ధరలోనే అద్భుతమైన ఫీచర్లను అందించింది.ఈ స్మార్ట్‌వాచ్ అమ్మకాలు భారత్‌లో మార్చి 15 నుండి ప్రారంభమవుతాయి. రెడ్మి వాచ్ 2 లైట్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలను పరిశీలిద్దాం.
రెడ్మీ వాచ్ 2 లైట్ ధర
రెడ్మీ వాచ్ 2 లైట్ భారతదేశంలో రూ. 4,999 వద్ద ప్రారంభమవుతుంది. భారతదేశంలోని ఇతర ఆఫ్‌లైన్ రిటైలర్లతో పాటు అమెజాన్, షియోమి వెబ్సైట్లు, Mi హోమ్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. రెడ్మీ వాచ్ 2 లైట్ బ్లాక్, బ్లూ, ఐవరీ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్‌లోని పట్టీలు బ్లాక్, బ్లూ, బ్రౌన్, ఐవరీ, ఆలివ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటాయి.
రెడ్మీ వాచ్ 2 లైట్ స్పెసిఫికేషన్లు
రెడ్మీ వాచ్ 2 లైట్1.55-అంగుళాల TFT డిస్ప్లేతో వస్తుంది. ఇది HD రిజల్యూషన్, 120 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంటుంది. బ్లడ్ ఆక్సిజన్ గాఢతను ట్రాక్ చేయడానికి SpO2 సెన్సార్, హృదయ స్పందన మానిటర్ ఫీచర్లను అందించింది. ఇది స్లీప్, స్ట్రెస్ మానిటరింగ్‌కు మద్దతిస్తుంది. 100 కంటే ఎక్కువ ఫిట్నెస్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఇది మహిళలు వారి పీరియడ్స్ ట్రాక్ చేయడానికి రుతుచక్రం ట్రాకింగ్ ఫీచర్‌తో కూడా వస్తుంది. రెడ్మి వాచ్ 2 లైట్ ఇన్‌బిల్ట్ జీపీఎస్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండా జీపీఎస్ ద్వారా లొకేషన్ ట్రాక్ చేయగలదు.
రెడ్మీ నోట్11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ భారత మార్కెట్లోకి రిలీజయ్యాయి. భారతదేశంలో రెడ్మీ నోట్ 11 ప్రో బేస్ 6GB + 128GB వేరియంట్ రూ. 17,999 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 8GB RAM మోడల్ రూ. 19,999 వద్ద లభిస్తుంది. మరోవైపు, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ బేస్ 6GB + 128GB మోడల్ రూ. 19,999 ధర వద్ద లభిస్తుంది. అయితే, 8GB + 128GB వేరియంట్ రూ. 21,999 వద్ద, 8GB + 256GB వేరియంట్ రూ. 23,999 వద్ద లభిస్తాయి. వీటి విక్రయాలు భారత్‌లో మార్చి 23న ప్రారంభమవుతాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.