Redmi TV: రూ.38 వేలకే 70 ఇంచుల భారీ 4K స్మార్ట్ టీవీ

70 ఇంచుల సైజు, ప్యాచ్‌వాల్ టెక్నాలజీ, 4కే రిజుల్యూషన్‌తో వస్తున్న ఈ టీవీ ధరను 3,799 చైనీస్‌ యువాన్లు (రూ.38వేలు)గా నిర్ణయించారు.

news18-telugu
Updated: August 29, 2019, 7:22 PM IST
Redmi TV: రూ.38 వేలకే 70 ఇంచుల భారీ 4K స్మార్ట్ టీవీ
రెడ్‌మీ టీవీ (Image:Twitter)
  • Share this:
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచనాలు సృష్టించిన షావోమీ సంస్థ...ఇప్పుడు టెలివిజన్ మార్కెట్‌లోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఎంఐ బ్రాండ్ పేరిట పలు స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. అద్భుతమైన ఫీచర్లున్న టీవీలను తక్కువ ధరకే అందిస్తూ సామ్‌సంగ్, ఎల్‌జీ, పానసోనిక్, సోని సహా పలు కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. తాజాగా రెడ్‌మీ బ్రాండ్ పేరిట తొలి స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది షావోమీ. బీజింగ్‌లో జరిగిన కార్యక్రమంలో 70 అంగుళాల స్మార్ట్ టీవీని విడుదల చేసింది. దీనికి రెడ్‌మీ టీవీ 70-ఇంచ్‌ అని నామకరణం చేశారు. 70 ఇంచుల సైజు, ప్యాచ్‌వాల్ టెక్నాలజీ,  4కే రిజుల్యూషన్‌తో వస్తున్న ఈ టీవీ ధరను 3,799 చైనీస్‌ యువాన్లు (రూ.38వేలు)గా నిర్ణయించారు. సెప్టెంబర్ 3 నుంచి  చైనాలో అమ్మకాలు ప్రారంభమవుతాయి. త్వరలోనే ఇండియాలోనూ ఈ టీవీని లాంచ్ చేయనున్నారు.

రెడ్‌మీ 70 ఇంచ్ టీవీ ఫీచర్లు:



































డిస్‌ప్లే సైజ్ 70 ఇంచులు
స్క్రీన్ రిజల్యూషన్ 4కే విత్ హెచ్‌డీఆర్ సపోర్ట్
ప్రాసెసర్: క్వాడ్ కోర్ 64 బిట్ ఎమ్‌లాజిక్ SoC
ర్యామ్ 2 జీబీ
స్టోరేజ్ 16 జీబీ
ఆడియో డాల్బీ ఆడియో, డీటీఎస్ హెచ్‌డీ
కనెక్టివిటీ డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, రెండు USB పోర్ట్స్, మూడు HDMI పోర్ట్స్, ఏవీ ఇన్‌పుట్
Published by: Shiva Kumar Addula
First published: August 29, 2019, 7:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading