news18-telugu
Updated: November 24, 2020, 1:07 PM IST
Wireless Earphones: రూ.2,000 లోపు బెస్ట్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ ఇవే...
స్టైలిష్ లుక్, కంఫర్ట్ కోసం వైర్లెస్ ఇయర్ ఫోన్లపై ఆధారపడక తప్పదు. అందుకే ఇయర్ ఫోన్స్ కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ కంపెనీలు.. మార్కెట్లో రోజూ కొత్త మోడల్స్ ఇయర్ ఫోన్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. అంతేకాదు వీటిని బడ్జెట్ లో ఉండేలా చేస్తూ, సరమైన ధరలకే సామాన్యులకు ఇయర్ ఫోన్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇలాంటి వాటిలో ముందుండే కంపెనీలు ఒప్పో, షియోమీ. రూ.2000 లోపు వీటి ధరలుండటం హైలైటే కదా. ఇంతకీ ఇలాంటి సరమైన ధరలకే లభించే ఒప్పో, షియోమీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయో వివరాలు తెలుసుకుందామా.
షియోమీ నుంచి 2 సరికొత్త కంప్లీట్లీ డిఫరెంట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్
ఇప్పటి వరకు వైర్లెస్ ఇయర్ ఫోన్లు వాడని వారికి ఈ ఇయర్ ఫోన్లు సూపర్ గా ఉంటాయి. అఫోర్డబుల్ గా ఉంటూనే చాలా యూజ్ ఫుల్ గా ఉండే ఈ మోడల్స్ ఇప్పుడు మార్కెట్ ను దున్నేస్తున్నాయి. ఎంట్రీ లెవెల్ ఆప్షన్స్ గా ఒప్పో, షియోమీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కు మంచి బజ్ వచ్చింది.
Mobile Apps: వెంటనే ఈ 5 యాప్స్ మీ ఫోన్ నుంచి డిలిట్ చేయండి
Redmi: మీరు కొన్న రెడ్మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా
Redmi SonicBass
ఎంట్రీ లెవెల్ వైర్లెస్ నెక్ బ్యాండ్ లో Xiaomi సబ్ బ్రాండ్ అయిన Redmi SonicBass పేరుకు తగ్గుట్టుగా నిజంగానే బాస్ లా ఉంది. SBC కోడెక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. AAC ఫీచర్ లేకపోవడం తోపాటు ఇది బ్లూటూత్ కు సపోర్ట్ చేయదు. చాలా లైట్ వెయిట్ ఉన్న నెక్ బ్యాండ్ , కంఫర్టబుల్ ఇయర్ బడ్స్, ఇయర్ బడ్స్ పైన ఉన్న సాఫ్ట్ సిలికాన్ ఇయర్ టిప్స్, డీసెంట్ పాసివ్ నాయిస్ ఐసొలేషన్ ఆకట్టుకునేలా ఉన్నాయి. జిమ్ కు తీసుకెళ్లేందుకు ఇవి బాగా పనికొస్తాయి. కానీ ఇదే కంపెనీ ప్రాడక్ట్ అిన Redmi Buds S ను కేవలం రూ.500 కే సొంతం చేసుకునే చాన్స్ ఉందన్న కంపేరిజన్ గుర్తుంచుకోండి.
యావరేజ్ సౌండ్ క్వాలిటీ
Redmi SonicBass బ్యాటరీ బ్యాకప్ 12 గంటలు వస్తుందని కంపెనీ ప్రామిస్ చేస్తుండగా వాడుకలో మాత్రం కేవలం 10 గంటలే బ్యాటరీ బ్యాకప్ వస్తోంది. మైక్రో USB ఛార్జర్ తో పనిచేస్తుంది. Redmi SonicBass ధర రూ.1,299 కాగా, ఏడాది వ్యారెంటీతో ఉండే ఈ మోడల్ యావరేజ్ సౌండ్ క్వాలిటీతో పనిచేస్తుంది. వాయిస్ క్వాలిటీ కూడా ఫర్వాలేదు అనిపించేలా ఉందనే ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీనికంటే Redmi Buds S (TWS) బెటర్ గా వాయిస్ వినిపిస్తుంది, పైగా వీటి ధర జస్ట్ రూ.500 మాత్రమే.
WhatsApp OTP scam: అలర్ట్... వాట్సప్‌లో ఓటీపీ స్కామ్ కలకలం... తప్పించుకోండి ఇలా
Earphones: ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడితే ఎంత డేంజరో తెలుసా?
Oppo Enco W11 TWS Earbuds
5 గ్రాముల కంటే తక్కువ బరువున్నOppo Enco W11 TWS Earbuds ట్రెండీగా ఉన్నాయి. బ్లూటూత్ 5.0 బడ్స్ ను ఈజీగా పెయిర్ చేసుకోవచ్చు. 10 మీటర్ల వరకూ వైర్లెస్ రేంజ్ ఉంది. జస్ట్ ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలా కంట్రోల్స్ పనిచేస్తాయి. కానీ ఇయర్ బడ్స్ అడ్జస్ట్ చేసుకునేప్పుడు కంట్రోల్ బటన్స్ ఆన్ అవుతుంటాయి. మీకు తెలియకుండానే డబుల్, ట్రిపుల్ ట్యాప్స్ కూడా అయిపోతాయి. True Wirlessలో ఉన్న డ్రా బ్యాక్ ఇదే. దీని ఆడియో క్వాలిటీ చాలా బాగుంది. Oppo ప్రామిస్ చేస్తున్నదాని ప్రకారం 20 గంటల బ్యాటరీ బ్యాకప్ ఈ మోడల్ ఇయర్ బడ్స్ తో వస్తుంది. కానీ నిజంగా వాడేసరికి సుమారు 18 గంటల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈ బడ్జెట్ లో ఇన్ని గంటలు బ్యాటరీ రావడం అంటే గొప్ప ఫీచర్ అనే భావించాల్సి ఉంటుంది. ఈ మోడల్ ఇయర్ బడ్స్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కూడా కాబట్టి చెమట పట్టిందనే భయమే అవసరం లేకుండా వర్కవుట్ టైంలో, వర్షం వస్తున్నా హ్యాపీగా వీటిని ఉపయోగించవచ్చు. Oppo Enco W11 ధరలు రూ. 2,499 నుంచి ప్రారంభమవుతుండగా, వీటిని ఇప్పుడు రూ.2,000 విక్రయిస్తున్నారు. వీటికి కూడా వ్యారెంటీ ఏడాది పాటు ఉంటుంది. నిజానికి Oppo Enco W11 రూ.1,999 చెల్లించి సొంతం చేసుకోవటం అంటే వాల్యూ ఫర్ మనీ అని చెప్పచ్చు. ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. అందుకే మంచి రివ్యూలు కూడా దీనికి వస్తున్నాయి.
Published by:
Santhosh Kumar S
First published:
November 24, 2020, 1:07 PM IST