Redmi Smart TV X: రెడ్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్ టీవీ.. 4K స్క్రీన్ తో మరెన్నో సూపర్ ఫీచర్లు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

55-అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్(Redmi Smart TV X) ధరను 2,999 యువాన్లుగా నిర్ణయించారు. ఇది భారతదేశంలో సుమారు రూ. 35,100 ధరతో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. 65-అంగుళాల సైజు వేరియంట్ ధరను 3,999 యువాన్(సుమారు రూ. 46,800)లుగా నిర్ణయించారు.

  • Share this:
స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌లో తన సత్తా చాటుతున్న ప్రముఖ చైనీస్ కంపెనీ రెడ్‌మీ(Redmi) స్మార్ట్‌టీవీ మార్కెట్లోనూ ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో బడ్జెట్ ధరల్లోనే స్మార్ట్‌టీవీలను తీసుకొస్తోంది. తాజాగా రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ (Redmi Smart TV X) పేరుతో ఓ సరికొత్త మోడల్‌ను చైనాలో లాంచ్ చేసింది. ఈ మోడల్ టీవీ ప్రారంభ ధరను 2,999 చైనీస్ (సుమారు రూ.35,100) యువాన్లుగా నిర్ణయించింది. ఈ స్మార్ట్ టీవీలో డ్యుయల్ 120Hz డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్, ఎంఈఎంసీ(MEMC) టెక్నాలజీ, 4K స్క్రీన్, డాల్బీ అట్మోస్ సపోర్ట్ వంటి మరెన్నో ఫీచర్లను అందించింది. మరి ఈ టీవీ ఇతర ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఈ మోడల్‌లో ఎన్ని సైజు వేరియంట్లు విడుదలయ్యాయి? వాటి ధరలు ఎంత? తదితర విషయాలు చూద్దాం.

55-అంగుళాల రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్(Redmi Smart TV X) ధరను 2,999 యువాన్లుగా నిర్ణయించారు. ఇది భారతదేశంలో సుమారు రూ. 35,100 ధరతో అమ్మకానికి వచ్చే అవకాశం ఉంది. 65-అంగుళాల సైజు వేరియంట్ ధరను 3,999 యువాన్(సుమారు రూ. 46,800)లుగా నిర్ణయించారు. ఈ రెండు టీవీ వేరియంట్లను సింగిల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో తీసుకొచ్చారు. అయితే భారతదేశంలో రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ మోడల్ ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Lenovo Yoga Tab 11: లెనోవో యోగా ట్యాబ్ 11 రిలీజ్... సేల్‌లో రూ.10,000 తగ్గింపు

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు
కొత్తగా విడుదల చేసిన రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్‌లో అల్ట్రా-హెచ్‌డీ (3840 x 2160 పిక్సెల్స్) డిస్‌ప్లే ఉంది. 55-ఇంచెస్, 65-ఇంచెస్ టీవీల వేరియంట్లలో గ్రేస్కేల్ రెస్పాన్స్ టైం 6.5ms గా ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు 10bit (8bit + FRC) కలర్ డెప్త్ సపోర్ట్, 94 శాతం P3 కలర్ గామట్ కవరేజీ (gamut coverage)తో వస్తాయి.
WhatsApp: గూగుల్‌ డ్రైవ్‌ లేకుండా కొత్త ఫోన్‌లోకి వాట్సప్​ డేటా ట్రాన్స్‌ఫర్‌ చేయండిలా

అంతేకాదు, రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ మోడల్ ఫ్రీసింక్ ప్రీమియం (Freesync Premium), డాల్బీ విజన్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌, ఎంఈఎంసీ (MEMC) టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. 3జీబీ ర్యామ్, 32జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ మీడియాటెక్ MTK 9650 ప్రాసెసర్‌ సాయంతో పనిచేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్టుతో వచ్చే ఈ టీవీ వేరియంట్లు నాలుగు ఇన్-బిల్ట్ స్పీకర్లను కలిగి ఉంటాయి.
Smartphones: స్మార్ట్ ఫోన్ పేలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

వీటిలో రెండు డక్ట్స్, 2×0.38L పెద్ద సౌండ్ క్యావిటీతో సీల్డ్ బాక్స్, 2×12.5W అవుట్‌పుట్, మీడియాటెక్ AI-PQ, AI-AQ పిక్చర్, ఆడియో ఫీచర్స్ అందించారు. ఇందులో TV HDMI 2.1 పోర్ట్, AV పోర్ట్, రెండు USB పోర్ట్‌లు, రెండు HDMI 2.0 పోర్ట్‌లు, ఒక S/PDIF పోర్ట్, ఒక RJ-45 పోర్ట్, ATV/ DTMB వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి. ఫార్-ఫీల్డ్ వాయిస్‌కు సపోర్ట్ చేసే నాలుగు మైక్రోఫోన్‌లు కూడా ఉంటాయి.
Published by:Nikhil Kumar S
First published: