హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi Pad: రెడ్‌మీ ప్యాడ్ సేల్ ప్రారంభం... తొలి సేల్‌లో భారీ డిస్కౌంట్

Redmi Pad: రెడ్‌మీ ప్యాడ్ సేల్ ప్రారంభం... తొలి సేల్‌లో భారీ డిస్కౌంట్

Redmi Pad: రెడ్‌మీ ప్యాడ్ సేల్ ప్రారంభం... తొలి సేల్‌లో భారీ డిస్కౌంట్
(image: Redmi India)

Redmi Pad: రెడ్‌మీ ప్యాడ్ సేల్ ప్రారంభం... తొలి సేల్‌లో భారీ డిస్కౌంట్ (image: Redmi India)

Redmi Pad | షావోమీ నుంచి మరో ట్యాబ్లెట్ ఇండియాలో లాంఛ్ అయింది. రెడ్‌మీ ప్యాడ్ (Redmi Pad) పేరుతో ఈ ట్యాబ్లెట్‌ను పరిచయం చేసింది. ఆఫర్స్ కూడా ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వీకెండ్‌లో సినిమాలు చూసేందుకు లేదా ఆన్‌లైన్ కోర్సుల కోసం ట్యాబ్లెట్స్ కొనేవారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ట్యాబ్లెట్స్ వినియోగం పెరిగిందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు కొత్త ట్యాబ్లెట్స్ (Tablet) లాంఛ్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా పోటాపోటీగా ట్యాబ్లెట్స్ తీసుకొస్తున్నాయి. చైనాకు చెందిన టెక్ బ్రాండ్ అయిన షావోమీ ఇండియాలో రెడ్‌మీ ప్యాడ్ (Redmi Pad) పేరుతో ఓ ట్యాబ్లెట్ లాంఛ్ చేసింది. సేల్ కూడా ప్రారంభమైంది. తొలి సేల్‌లోనే భారీ డిస్కౌంట్‌తో ఆఫర్స్ ప్రకటించింది రెడ్‌మీ ఇండియా.

రెడ్‌మీ ప్యాడ్ ధర

రెడ్‌మీ ప్యాడ్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 3జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.19,999. ఇంట్రడక్టరీ ధరల్ని ప్రకటించింది కంపెనీ. 3జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.17,999. ఇక 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. ఆఫర్స్‌తో 3జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.11,700 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.13,500 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,300 ధరకు సొంతం చేసుకోవచ్చు. Mi.com, ఎంఐ హోమ్, ఫ్లిప్‌కార్ట్ , రీటైల్ ఔట్‌లెట్స్‌లో కొనొచ్చు. గ్రాఫైట్ గ్రే, మింట్ గ్రీన్, మూన్‌లైట్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు.

Jio 5G Offer: నేటి నుంచి జియో ట్రూ 5జీ సేవలు... ఆఫర్ వివరాలు ఇవే

రెడ్‌మీ ప్యాడ్ స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ ప్యాడ్ ఫీచర్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 10.2 అంగుళాల 2కే డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇటీవల మీడియాటెక్ నుంచి వచ్చిన లేటెస్ట్ ప్రాసెసర్ ఇది. ఈ ట్యాబ్లెట్‌కు 5జీ సపోర్ట్ లభించదు. ఇది 4జీ ట్యాబ్లెట్. 6జీబీ వరకు ర్యామ్, 128జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. మెమొరీ కార్డ్ సపోర్ట్‌తో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.

రెడ్‌మీ ప్యాడ్‌లో క్వాడ్ స్పీకర్స్, డాల్బీ ఆట్మస్ సపోర్ట్, 8,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులో 22.5వాట్ ఛార్జర్ లభిస్తుంది. 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్లు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తామని కంపెనీ చెబుతోంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే బ్లూటూత్ 5.3, వైఫై 5, యూఎస్‌బీ సీ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ బరువు 465గ్రాములు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Smartphone, Tablet

ఉత్తమ కథలు