షియోమి కంపెనీకి చెందిన రెడ్‌మీ బడ్జెట్ రేంజ్ ఫోన్‌లు(Phone) లాంచ్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండియన్ మొబైల్ మార్కెట్‌లో తక్కువ కాలంలోనే మెరుగైన వాటాను సొంతం చేసుకుంది. ఇప్పుడు రెడ్‌మీ కంపెనీ స్మార్ట్‌ఫోన్‌లపై మాత్రమే కాకుండా ఇతర విభాగాలపై దృష్టి పెట్టింది. తాజాగా Redmi Pad పేరిట ఇండియన్ మార్కెట్‌లోకి సరికొత్త ఆండ్రాయిట్ టాబ్లెట్ లాంచ్ చేసింది. మార్కెట్‌లో ఈ ట్యాబ్ ధర రూ.14,999గా ఉంది. ఈ లేటెస్ట్ ట్యాబ్లెట్ ఫీచర్‌లు ఎలా ఉన్నాయి? ఎలా పని చేస్తుందనే అంశాలను తెలుసుకుందాం.
రెడ్‌మీ ప్యాడ్‌లో ఆకట్టుకునే అంశాలు
* రెడ్‌మీ ప్యాడ్ ట్యాబ్లెట్ బడ్జెట్ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ ట్యాబ్ ప్రీమియం మెటల్ బాడీతో వస్తుంది. 7.1mm స్లిమ్ ఫ్రేమ్ డిజైన్‌తో రూపొందింది. 500 గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది. సులువుగా ట్యాబ్లెట్‌ను తీసుకెళ్లవచ్చు. మాట్టే ఫినిష్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.
* రెడ్‌మీ ప్యాడ్ 10.61-అంగుళాల LCD ప్యానెల్‌ను అందిస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్ ఉంటుంది. కానీ ఒలియోఫోబిక్ కోటింగ్ లేకపోవడం వల్ల స్క్రీన్‌పై స్మడ్జ్‌లు కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి.
* టాబ్లెట్ Widevine L1 సర్టిఫికేషన్‌లతో వస్తుంది. అంటే Netflix సహా వివిధ OTT ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ని ఆస్వాదించవచ్చు.
* రెడ్‌మీ ప్యాడ్ MediaTek Helio G99 చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఇది 4G-ఎనేబుల్డ్ హార్డ్‌వేర్, కానీ రోజువారీ పనులు, గేమింగ్ సెషన్‌లను ఎటువంటి అవాంతరాలు లేకుండా అందిస్తుంది. హై రిఫ్రెష్ రేట్ సెట్టింగ్‌లలో పాపులర్ గేమ్స్‌ను కూడా ఎక్స్‌పీరియన్స్ చేయవచ్చు. మైనర్ స్టట్టర్స్‌ను విస్మరించవచ్చు.
* ఈ ట్యాబ్లెట్‌లో ఎక్స్‌ప్యాండబుల్ స్టోరేజ్ స్లాట్ ఉంటుంది. అవసరమైతే 1TB వరకు పెంచుకొనే సదుపాయం ఉంటుంది. రెడ్‌మీ Dolby Atmos స్పీకర్‌లను కూడా అందిస్తోంది.
* ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతున్న MIUI 13 ప్యాడ్ వెర్షన్‌లో ఎక్కువ బ్లోట్‌వేర్ లేకపోవడం మరో పెద్ద ప్లస్. మొత్తం బెస్ట్ UI ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
* ఇందులో 8000mAh బ్యాటరీ ఉంటుంది. కొన్ని రోజుల పాటు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
పరిశీలించాల్సిన అంశాలు ఇవే..
Redmi Pad కొన్ని కారణాల వల్ల భారతదేశంలో సెల్యులార్ వేరియంట్‌ను లాంచ్ చేయలేదు. బేసిక్ కెమెరాలను అందించింది. బ్యాక్ కెమెరా కూడా మెరుగైన ఫొటోలను అందించలేదు. అదే విధంగా ట్యాబ్లెట్లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లేదు. సాఫ్ట్‌వేర్-సెంట్రిక్ ఫేస్ అన్‌లాక్ లేదా భద్రత కోసం PIN లాక్ మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. టాబ్లెట్‌కు హెడ్‌ఫోన్ జాక్ కూడా లేదు. 8000mAh బ్యాటరీ 18W ఛార్జింగ్‌కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.
రెడ్‌మీ ప్యాడ్ కొనుగోలు చేయవచ్చా? లేదా?
రెడ్‌మీ ప్యాడ్‌లో లోపాల కంటే ఎక్కువ ప్లస్‌లు ఉన్నాయి. బడ్జెట్ ట్యాబ్లెట్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు. అధిక రిఫ్రెష్ రేట్‌తో కూడిన పెద్ద స్క్రీన్‌ని ఎంజాయ్ చేయవచ్చని, స్టోరేజ్ ఎక్స్‌ప్యాండ్ చేసుకోవచ్చని, బ్యాటరీ లైఫ్ బావుందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5g technology, Red mi, Smartphones, Xiomi