news18-telugu
Updated: November 24, 2020, 4:30 PM IST
Redmi Note 9 Pro 5G: రెడ్మీ నుంచి రానున్న 5G స్మార్ట్‌ఫోన్
(Image Credit: Weibo)
మార్కెట్లోకి మరో 5G స్మార్ట్‌ఫోన్ విడుదల కానుంది. రెడ్మి నోట్ 9 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దాంతో పాటు రెడ్మి నోట్ 9 5G, రెడ్మి నోట్ 9 4G వేరియంట్లను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెడ్మి అధికారికంగా వెల్లడించింది. నోట్ 9 ప్రో మోడల్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో పనిచేయనుందని సంస్థ జనరల్ మేనేజర్ లు వీబింగ్ తెలిపారు. గతంలో విడుదలైన Mi 10T Lite మోడల్లోనూ ఇదే ప్రాసెసర్‌ను అమర్చారు.
రీ బ్రాండెడ్ వెర్షన్‌గా తాజా స్మార్ట్‌ఫోన్
రెడ్మి నోట్ 9 ప్రో 5G ఫోన్‌ను Mi 10T Lite మోడల్‌కు రీబ్రాండెడ్ వెర్షన్‌గా రూపొందించారని గతంలో వార్తలు వచ్చాయి. వీబింగ్ చెప్పిన మాటలు ఈ వార్తలను ధ్రువీకరించేలా ఉన్నాయి. శక్తిమంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750G చిప్సెట్తో రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ఫోన్‌ను తయారు చేశామని ఆయన చెప్పారు. దీన్నే 10టీ మోడల్లోనూ వాడటం విశేషం. ఈ చిప్సెట్ 192 మిలియన్ పిక్సెల్ ఫోటోలు తీసేందుకు, 4K HDR వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
Mobile Apps: వెంటనే ఈ 5 యాప్స్ మీ ఫోన్ నుంచి డిలిట్ చేయండి
Redmi: మీరు కొన్న రెడ్మీ ప్రొడక్ట్స్ నకిలీవా? గుర్తించండి ఇలా
సరికొత్త ఫీచర్లు
రెడ్మి నోట్ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, టెలిఫోటో కెమెరా, మాక్రో లెన్స్‌తో కెమెరా సెటప్ ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెడ్మి నోట్ 9 ప్రో డిజైన్‌ను గతంలోనే షియోమి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్లిమ్ ఫార్మ్ ఫ్యాక్టర్ డిజైన్‌లో తయారు చేశారు. దీనికి వెనుక వైపు సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. రెడ్మి నోట్ 9ప్రో 5జీ 6.7 అంగుళాల హోల్-పంచ్ LCD డిస్ప్లేతో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4,280 ఎంఏహెచ్ ఉండవచ్చు.
Jio New Plans: జియోలో రూ.75 నుంచే ఆల్ ఇన్ వన్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
Prepaid Plans: రూ.300 లోపు రీఛార్జ్ చేయాలా? Airtel, Jio, Vi ప్లాన్స్ ఇవే
భారత్‌లో విడుదల చేస్తారా?
భారత్‌లో రెడ్మి నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ గతంలో ఆ సంస్థ నుంచి వచ్చిన Mi 10T Lite మోడల్‌ను మన దేశంలో విడుదల చేయలేదు. దానికి రీ బ్రాండెడ్ వెర్షన్‌గా భావిస్తున్న రెడ్మి నోట్ 9 ప్రో 5జీ వేరియెంట్‌ను భారత్‌లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
Published by:
Santhosh Kumar S
First published:
November 24, 2020, 4:30 PM IST