Home /News /technology /

REDMI NOTE 9 FIRST SALE TODAY ON AMAZON INDIA KNOW PRICE AND OTHER SPECS SS

Redmi Note 9: కాసేపట్లో రెడ్‌మీ నోట్ 9 సేల్... ఫీచర్స్ ఇవే

Redmi Note 9: అదిరిపోయే ఫీచర్స్‌తో రెడ్‌మీ నోట్ 9 రిలీజ్... ధర కూడా తక్కువే
(image: Redmi India)

Redmi Note 9: అదిరిపోయే ఫీచర్స్‌తో రెడ్‌మీ నోట్ 9 రిలీజ్... ధర కూడా తక్కువే (image: Redmi India)

Redmi Note 9 | షావోమీ ఫ్యాన్స్‌కు శుభవార్త. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ ఇవాళ ప్రారంభం కానుంది. ధరతో పాటు స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.12,000 లోపేనా? షావోమీ నుంచి ఇటీవల రెడ్‌మీ నోట్ 9 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. తొలి సేల్ జూలై 24న అంటే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో ప్రారంభమవుతుంది. రెడ్‌మీ నోట్ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. ఇప్పటికే నోట్ 9 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. వీటి కన్నా తక్కువ ధరకే రెడ్‌మీ నోట్ 9తీసుకొచ్చింది షావోమీ. ప్రారంభ ధర రూ.11,999 మాత్రమే. 5,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

    Realme: 20 నిమిషాల్లో 100 పర్సెంట్ ఛార్జింగ్... రియల్‌మీ మరో సంచలనం

    Broadband Plans: ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలా? బెస్ట్ ప్లాన్స్ ఇవే



    రెడ్‌మీ నోట్ 9 స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.53 అంగుళాలో ఫుల్ హెచ్‌డీ+
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85
    రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,020ఎంఏహెచ్
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ 11
    సిమ్ సపోర్ట్:
    కలర్స్: ఆక్వా గ్రీన్, పెబ్బెల్ గ్రే, అర్క్టిక్ వైట్
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.11,999
    4జీబీ+128జీబీ- రూ.13,499
    6జీబీ+128జీబీ- రూ.14,999
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Redmi, Smartphone, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు