షావోమీ ఇండియా కొత్త ఏడాదిలో కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో (Redmi Note 12 Series) మూడు మొబైల్స్ తీసుకొచ్చింది. రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ మోడల్స్ రిలీజ్ చేసింది. రూ.15,000, రూ.20,000, రూ.25,000 బడ్జెట్‌లో ఈ మొబైల్స్ రిలీజ్ చేసింది రెడ్‌మీ ఇండియా. వీటిలో అమొలెడ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. షావోమీ ఇండియా భారతదేశంలో ఇప్పటివరకు రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ సిరీస్ మొబైల్స్ అన్నీ పాపులర్ అయ్యాయి. మరి రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో వచ్చిన రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ ధర, ఫీచర్స్ వివరాలు తెలుసుకోండి.
రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,499 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,499. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,499 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.1,500 లభిస్తుంది. జనవరి 11 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్‌లో కొనొచ్చు.
Jio True 5G: మీ స్మార్ట్‌ఫోన్‌లో జియో ట్రూ 5జీ కావాలా? ఈ సెట్టింగ్స్ మార్చండి
రెడ్‌మీ నోట్ 12 ప్రత్యేకతలు చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 48మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.23,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.3,000 లభిస్తుంది. జనవరి 11 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్‌లో కొనొచ్చు.
Samsung Galaxy F04: రూ.8,000 లోపు సాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్... ఫీచర్స్ ఇవే
రెడ్‌మీ నోట్ 12 ప్రో మొబైల్‌లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 12 ప్రో+ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.25,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.28,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అదనంగా ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.3,000 లభిస్తుంది. జనవరి 11 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్‌లో కొనొచ్చు.
LIC WhatsApp Services: ఎల్ఐసీ పాలసీ ఉన్నవారికి గుడ్ న్యూస్... ఇక ఈ సేవలన్నీ వాట్సప్‌లోనే పొందొచ్చు
రెడ్‌మీ నోట్ 12 ప్రో+ మొబైల్‌లో కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, 200మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5,000mAh బ్యాటరీ, 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Redmi, Smartphone