హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi Note 12 Pro: రెడ్‌మీ నోట్ 10 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మీ నోట్ 12 ప్రో రానుందా? రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే!

Redmi Note 12 Pro: రెడ్‌మీ నోట్ 10 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మీ నోట్ 12 ప్రో రానుందా? రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయంటే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెడ్‌మీ(Redmi) ఫోన్‌లకు ఇండియాలో మంచి డిమాండ్‌ ఉంది. బెస్ట్‌ ఫీచర్‌లను అందుబాటు ధరల్లో వినియోగదారులకు అందించడం ఈ బ్రాండ్‌ ప్రత్యేకత. అయితే అక్టోబర్‌లో ఈ కంపెనీ రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5G(Redmi Note 12 Pro) స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మోడల్‌కు సంబంధించి 4G వేరియంట్‌పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Redmi Note 12 Pro : షియోమి(Xiaomi) సబ్-బ్రాండ్ రెడ్‌మీ(Redmi) ఫోన్‌లకు ఇండియాలో మంచి డిమాండ్‌ ఉంది. బెస్ట్‌ ఫీచర్‌లను అందుబాటు ధరల్లో వినియోగదారులకు అందించడం ఈ బ్రాండ్‌ ప్రత్యేకత. అయితే అక్టోబర్‌లో ఈ కంపెనీ రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 5G(Redmi Note 12 Pro) స్మార్ట్‌ఫోన్‌ని చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మోడల్‌కు సంబంధించి 4G వేరియంట్‌పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఉన్న ప్లాన్‌ను సవరించి ఇండియాలో ఈ మోడల్‌ను లాంచ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

 IMEI డేటాబేస్‌లో వివరాలు

XiaomiUi రిపోర్ట్ ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివరాలు IMEI డేటాబేస్‌లో నమోదు అయినట్లు సమాచారం. రెడ్‌మీ నోట్‌ 10 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్‌గా రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 4G స్మార్ట్‌ఫోన్ వచ్చే అవకాశం ఉంది. IMEI డేటాబేస్‌లో లిస్టింగ్ ప్రకారం.. రెడ్‌మీ నోట్‌ 12 ప్రో 4Gకి ‘sweet_k6a_global' అనే కోడ్‌నేమ్ ఉండగా, గ్లోబల్ వేరియంట్‌‌ కోడ్‌నేమ్ ‘sweet_global’గా ఉంది.

ముందుగా అనుకున్న ప్లాన్‌లో మార్పులు

ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెడ్‌మీ నోట్ 11 ప్రో‌ గా 2023లో లాంచ్ చేయాలని కంపెనీ ముందుగా ప్లాన్ చేసింది. అయితే కొన్ని మార్పులు చేసి, రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌తో పాటు, రెడ్‌మీ నోట్ 12 ప్రో 4జీ‌గా లాంచ్ చేయనున్నట్లు XiaomiUi రిపోర్ట్ వెల్లడించింది. రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఇటీవల (అక్టోబర్) చైనాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో+ వంటి మూడు మోడల్స్ ఉన్నాయి.

Nothing CEO: నథింగ్‌ బ్రాండ్‌ అభిమానులకు కంపెనీ సీఈవో కార్ల్‌ పీ బ్యాడ్‌ న్యూస్‌.. అదేంటంటే..!

 నాలుగు వేరియంట్లలో రెడ్‌మీ నోట్‌ 12

రెడ్‌మీ నోట్ 12 నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ (4GB RAM +128GB) ధర చైనా కరెన్సీలో CNY 1,199 (సుమారు రూ. 13,600). 6GB RAM + 128GB వేరియంట్ ధర CNY 1299 (సుమారు రూ.14,600)గా ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,499 (సుమారు రూ. 17,000)గా కంపెనీ నిర్ణయించింది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 1699 (సుమారు రూ. 19,300) ప్రైస్ ట్యాగ్‌తో వస్తుంది.

నాలుగు మోడల్స్‌లో రెడ్‌మీ నోట్‌ 12 ప్రో

రెడ్‌మీ నోట్ 12 ప్రో కూడా నాలుగు వేరియంట్లలో లాంచ్ అయింది. రెడ్‌మీ నోట్‌ 12 ప్రో బేస్ వేరియంట్ (6GB RAM +128GB) ధర CNY 1699 (సుమారు రూ.19,300)గా కంపెనీ నిర్ణయించింది. ఇక 8GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,799 (సుమారు రూ. 20,400)గా ఉంది. 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 1,999 (సుమారు రూ. 22,700)కాగా, 12GB RAM +256GB టాప్ వేరియంట్ ధర CNY 2,199 (సుమారు రూ. 24,900)గా ఉంది.

రెడ్‌మీ నోట్‌12 ప్రో + రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. బేస్ వేరియంట్ 8GB RAM + 256GB ధర CNY 2,099 (సుమారు రూ. 23,000) కాగా, టాప్ వేరియంట్ 12GB RAM + 256GB ధర CNY 2,299 (సుమారు రూ. 26,00)గా కంపెనీ నిర్ణయించింది.

First published:

Tags: Redmi, Xiaomi

ఉత్తమ కథలు