రెడ్‌మీ నుంచి ఇండియాలో మరో రెండు మొబైల్స్ లాంఛ్ అయ్యాయి. రెడ్‌మీ నోట్ 12 4జీ (Redmi Note 12 4G), రెడ్‌మీ 12సీ (Redmi 12C) లాంఛ్ చేసింది కంపెనీ. ప్రారంభ ధర రూ.8,999 మాత్రమే. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 12 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 12 5జీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు రెడ్‌మీ నోట్ 12 4జీ రిలీజైంది. దీంతో పాటు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 12సీ కూడా వచ్చేసింది. ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి కొత్త మోడల్స్ వచ్చాయి. మరి కొత్తగా రిలీజైన ఈ రెండు మొబైల్స్ ప్రత్యేకతలేంటీ? ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
రెడ్‌మీ నోట్ 12 4జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డులతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. షావోమీ యూజర్స్ రూ.1,500 లాయల్టీ బోనస్ పొందొచ్చు. బ్లాక్, బ్లూ, గోల్డ్ కలర్స్‌లో కొనొచ్చు. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది.
Samsung Galaxy F14 5G: సాంసంగ్ కొత్త 5జీ ఫోన్ సేల్ ఈరోజే... 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, మరెన్నో ఫీచర్స్
రెడ్‌మీ నోట్ 12 4జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా ఫీచర్స్ చూస్తే 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా, 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
రెడ్‌మీ 12సీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ కలర్స్‌లో కొనొచ్చు. ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది.
iPhone 14: భారీగా తగ్గిన ఐఫోన్ 14 ధర... తొలిసారి ఇంత తక్కువ రేటుకే
రెడ్‌మీ 12సీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.71 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండగా, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Redmi, Smartphone