Home /News /technology /

Redmi Note 11T 5G: నవంబర్​ 30న రెడ్​మీ నోట్​ 11 టీ 5జీ స్మార్ట్​ఫోన్​​ లాంచ్​.. అత్యంత వేగవంతమైన 5జీ స్మార్ట్​ఫోన్​

Redmi Note 11T 5G: నవంబర్​ 30న రెడ్​మీ నోట్​ 11 టీ 5జీ స్మార్ట్​ఫోన్​​ లాంచ్​.. అత్యంత వేగవంతమైన 5జీ స్మార్ట్​ఫోన్​

త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 11 విడుదల (ప్రతీకాత్మక చిత్రం)

త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 11 విడుదల (ప్రతీకాత్మక చిత్రం)

Redmi Note 11T 5G : రెడ్​మీ నోట్​11టీ 5G స్మార్ట్​ఫోన్​ రిలీజ్​ డేట్​ను ఫిక్స్​ చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ను నవంబర్ 30వ తేదీన భారత్​లో విడుదల చేయనుంది.

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ (Smart Phone) తయారీ సంస్థ షియోమి (Xiaomi).. గత నెలలో రెడ్​మీ నోట్​ 11 (RedMi Note 11) సిరీస్​ను చైనాలో లాంచ్​ చేసిన విషయం తెలిసిందే. అక్కడ రెడ్​మీ నోట్ 11 సిరీస్​లో రెడ్​మీ నోట్ 11 5 జీ, రెడ్ మీ నోట్ 11 ప్రో, రెమీ నోట్ 11 ప్రో ప్లస్ మోడల్స్ లాంచ్​ అయ్యాయి. అయితే, ఇప్పుడు ఈ సిరీస్​ను భారత్​లో లాంచ్​ చేసేందుకు షియోమి సిద్ధమవుతోంది. రెడ్​మీ నోట్​11టీ 5G స్మార్ట్​ఫోన్​ రిలీజ్​ డేట్​ను ఫిక్స్​ చేసింది. ఈ స్మార్ట్​ఫోన్​ను నవంబర్ 30వ తేదీన భారత్​లో విడుదల చేయనుంది. మరోవైపు, లాంచింగ్​కు ముందే దీనికి సంబంధించిన ఫీచర్లను ప్రకటించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ ఏడాది జులైలో లాంచ్​ అయిన రెడ్​మీ నోట్​ 10టీ 5జీ ఫోన్​కు కొనసాగింపుగా రానుంది. ఇది పోకో ఎం4 పర్ఓ 5జీ స్మార్ట్​ఫోన్​కు రీబ్రాండ్​ వెర్షన్​గా రానుంది. కాగా, 6 ఎన్​ఎమ్​ చిప్‌సెట్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్​గా కంపెనీ దీన్ని పేర్కొంది.

ఇది భారత దేశంలో మొట్టమొదటి 6 ఎన్​ఎమ్​ చిప్​సెట్​ స్మార్ట్​ఫోన్​గా పేర్కొంటూ షియోమి సీఈవో మను కుమార్ జైన్ ట్వీట్​ చేశారు. ఈ స్మార్ట్​ఫోన్​ మెరుగైన బ్యాటరీ లైఫ్, పర్ఫార్మెన్స్​తో వస్తుందని పేర్కొన్నారు. అంతేకాదు, రెడ్​మీ నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని స్మార్ట్​ఫోన్లలో కెల్లా అత్యంత వేగవంతమైన 5జీ స్మార్ట్‌ఫోన్​గా అభివర్ణించారు. అయితే ఈ స్మార్ట్​ఫోన్​ ఏ ప్రాసెసర్​పై పనిచేస్తుందో వెల్లడించలేదు. ఇది మీడియా టెక్​ ప్రాసెసర్​తో డైమెన్సిటీ 810 ప్రాసెసర్​పై పనిచేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Vivo Y74s: వివో నుంచి మరో మిడ్​ రేంజ్​ స్మార్ట్​ఫోన్ లాంచ్​.. అందుబాటు ధరలోనే అదిరిపోయే ఫీచర్లు




* రెడ్​మీ నోట్​ 11టీ 5జీ స్పెసిఫికేషన్లు..

రెడ్​మీ నోట్​ 11 టీ 5 జీ గత నెలలో చైనాలో విడుదలైన రెడ్​మీ నోట్​ 11 5 జీ రీబ్రాండెడ్ వెర్షన్‌గా వస్తోంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.6 అంగుళాల FHD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్​ఫోన్​ 8 జీబీ ర్యామ్​, 256 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​తో వస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ స్లాట్ ద్వారా దీని స్టోరేజ్​ను మరింత విస్తరించవచ్చు. కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 8 -మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఆశించవచ్చు.

YouTube Video: రోజు చూసే యూ ట్యూబ్ గురించి .. ఆస‌క్తిక‌ర విష‌యాలు


ఇక, దీని ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ షూటర్‌ కెమెరాను చేర్చనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5జీ, 4జీ ఎల్​టీఈ, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్​బీ టైప్- సీ పోర్ట్‌తో వస్తుంది. దీని ధర రూ. 20 వేలలోపే ఉండనుందని నివేదికలు సూచిస్తున్నాయి.
Published by:John Kora
First published:

Tags: 5G Smartphone, Redmi, Smartphone, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు