Home /News /technology /

REDMI NOTE 11T 5G VS LAVA AGNI 5G VS REALME 8S 5G KNOW ABOUT BEST SMARTPHONE WITH MEDIATEK DIMENSITY 810 PROCESSOR SS

MediaTek Dimensity 810: ఒకే ప్రాసెసర్... మూడు స్మార్ట్‌ఫోన్లు... వీటిలో ఏది బెస్ట్?

MediaTek Dimensity 810: ఒకే ప్రాసెసర్... మూడు స్మార్ట్‌ఫోన్లు... వీటిలో ఏది బెస్ట్?

MediaTek Dimensity 810: ఒకే ప్రాసెసర్... మూడు స్మార్ట్‌ఫోన్లు... వీటిలో ఏది బెస్ట్?

MediaTek Dimensity 810 | ప్రస్తుతం ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G), లావా అగ్ని 5జీ (Lava Agni 5G), రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. వీటిలో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోనో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    మీడియాటెక్ డైమెన్సిటీ 810... ఇప్పుడు ఈ ప్రాసెసర్‌తో మూడో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. షావోమీ నుంచి రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇదే ప్రాసెసర్‌తో ఇప్పటికే ఇండియాలో మరో రెండు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. గత నెలలో రిలీజ్ అయిన లావా అగ్ని 5జీ (Lava Agni 5G) స్మార్ట్‌ఫోన్‌లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్ ఉంది. ఇక అంతకుముందు ఇదే ప్రాసెసర్‌తో రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) రిలీజ్ అయింది. స్మార్ట్‌ఫోన్ పనితీరుకు ప్రాసెసర్ ముఖ్యం. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒకే ప్రాసెసర్ ఉంది. మరి మిగతా ఫీచర్స్‌తో పోలిస్తే ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్? ఇక్కడ తెలుసుకోండి.





































































     స్పెసిఫికేషన్స్ రెడ్‌మీ నోట్ 11టీ 5జీ లావా అగ్ని 5జీరియల్‌మీ 8ఎస్ 5జీ
     డిస్‌ప్లే  90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే
    ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ 8జీబీ+128జీబీ 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ
     ప్రాసెసర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 మీడియాటెక్ డైమెన్సిటీ 810 మీడియాటెక్ డైమెన్సిటీ 810
     రియర్ కెమెరా 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో క్వాడ్ కెమెరా 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ పోర్ట్‌రైట్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్
     ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా 16 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్
     బ్యాటరీ 5,000ఎంఏహెచ్ (33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) 5,000ఎంఏహెచ్ (30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) 5,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
     ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 స్టాక్ ఆండ్రాయిడ్ 11 ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ
     సిమ్ సపోర్ట్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్
     కలర్స్ స్టార్ డస్ట్ వైట్, మ్యాటీ బ్లాక్, మ్యాజెస్టిక్ బ్లూ ఫైరీ బ్లూ యూనివర్స్ బ్లూ, యూనివర్స్ పర్పుల్
     ధర

     6జీబీ+64జీబీ- రూ.16,999

    6జీబీ+128జీబీ- రూ.17,999

    8జీబీ+128జీబీ-రూ.19,999
      8జీబీ+128జీబీ- రూ.19,9996జీబీ+128జీబీ- రూ.17,999   8జీబీ+128జీబీ- రూ.19,999

    మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ మూడు స్మార్ట్‌ఫోన్లలో ఫీచర్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. అయితే లావా అగ్ని 5జీ, రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే లేటెస్ట్‌గా రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ధర కాస్త తక్కువగా ఉంది. ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.14,999 మాత్రమే. ఆఫర్ కొన్ని రోజులే అందుబాటులో ఉంటుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Lava, Mobile News, Mobiles, Realme, Realme UI, Redmi, Smartphone, Xiaomi

    తదుపరి వార్తలు