ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రెడ్మీ ఇండియా (Redmi India) నుంచి రెడ్మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రూ.15,000 లోపు బడ్జెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది రెడ్మీ ఇండియా. ఇది రెడ్మీ నోట్ 11 సిరీస్‌లో రిలీజ్ అయిన తొలి స్మార్ట్‌ఫోన్ కాగా, రెడ్మీ నుంచి వచ్చిన రెండో 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone). ఇప్పటికే రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఉంది. మరి రెడ్మీ నోట్ 10టీ 5జీ మొబైల్ కన్నా లేటెస్ట్గా రిలీజ్ అయిన రెడ్మీ నోట్ 11టీ 5జీ బాగుందా? ఈ రెండు స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్స్‌లో ఎలాంటి తేడాలు ఉన్నాయి? తెలుసుకోండి.
Dislplay: రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే ఉంటే, రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మాత్రం 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉంది.
Smartphone Tips: పొరపాటున ఫోటోలు, వీడియోలు డిలిట్ చేశారా? ఇలా తిరిగి పొందొచ్చు
RAM and Internal Storage: రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ మాత్రం 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో కూడా లభిస్తుంది.
Processor: రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంది. ప్రాసెసర్ విషయంలో అప్‌గ్రేడ్ చేసింది షావోమీ.
Camera: రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండగా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. కెమెరా కూడా అప్‌గ్రేడ్ చేసింది షావోమీ.
WhatsApp Web: స్మార్ట్‌ఫోన్ లేకపోయినా వాట్సప్ వెబ్ ఉపయోగించండి ఇలా
Battery: ఈ రెండు స్మార్ట్ఫోన్లలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటే, రెడ్మీ నోట్ 10టీ 5జీ మొబైల్లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రెడ్మీ నోట్ 11టీ 5జీ మోడల్లో ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది.
Price: రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇంట్రడక్టరీ ఆఫర్లో 6జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు కొనొచ్చు. రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ధరలు చూస్తే... 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.16,999.
Colors: రెడ్మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను స్టార్ డస్ట్ వైట్, మ్యాటీ బ్లాక్, మ్యాజెస్టిక్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Smartphone, Xiaomi