Home /News /technology /

Redmi Note 11T 5G: రూ.15,000 లోపు మరో 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

Redmi Note 11T 5G: రూ.15,000 లోపు మరో 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

Redmi Note 11T 5G: రూ.15,000 లోపు మరో 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ప్రత్యేకతలు ఇవే
(image: Redmi India)

Redmi Note 11T 5G: రూ.15,000 లోపు మరో 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ప్రత్యేకతలు ఇవే (image: Redmi India)

Redmi Note 11T 5G | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) కొనాలని అనుకుంటున్నారా? రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    షావోమీ సబ్ బ్రాండ్ అయిన రెడ్‌మీ ఇండియాలో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ (Redmi Note 11T 5G) మోడల్‌ను పరిచయం చేసింది. ఇండియాలో రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో (Redmi Note 11 Series) రిలీజ్ అయిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10టీ 5జీ మోడల్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ మోడల్ రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాకు తీసుకొచ్చింది రెడ్‌మీ ఇండియా. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న రియల్‌మీ 8 5జీ, పోకో ఎం3 ప్రో 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ, రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లకు రెడ్‌మీ నోట్ 11టీ 5జీ పోటీ ఇవ్వనుంది.

    ధర ఎంతంటే...


    రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ప్రారంభ ధర రూ.16,999. ఇది 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ ధర రూ.19,999. డిసెంబర్ 7న అమెజాన్‌లో సేల్ ప్రారంభం కానుంది. ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా రూ.1,000 తగ్గింపు ప్రకటించింది రెడ్‌మీ ఇండియా. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. మొత్తం రూ.2,000 డిస్కౌంట్ పొందొచ్చు. అంటే రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొన్ని రోజులే ఉంటుంది.

    Flipkart Black Friday Sale: ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్... ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు


    స్పెసిఫికేషన్స్ ఇవే...


    రెడ్‌మీ నోట్ 11టీ 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ టెక్నాలజీతో 3జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉంది.

    Moto G31: అదిరిపోయే ఫీచర్స్‌తో రిలీజ్ అయిన మోటో జీ31... ధర ఎంతంటే

    కెమెరా, బ్యాటరీ ఫీచర్స్


    రెడ్‌మీ నోట్ 11టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ప్రో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్టార్ డస్ట్ వైట్, మ్యాటీ బ్లాక్, మ్యాజెస్టిక్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Credit cards, Icici, Icici bank, Mobile News, Mobiles, Redmi, Smartphone, Xiaomi

    తదుపరి వార్తలు