Redmi Note 11: రెడ్మీ నుంచి మరో రెండు స్మార్ట్ఫోన్లు.. ఈ సారి అందరికీ అందుబాటు ధరల్లో.. ఫీచర్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
షియోమి (Xiao mi) సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. ఈ బ్రాండ్ రెడ్మీ నోట్(Note) 11, 11ఎస్ పేరుతో కొత్త మొడల్స్ (new models)ను ఫిబ్రవరిలో(February) లాంచ్ చేయనుంది.
షియోమి (Xiao mi) సబ్ బ్రాండ్ రెడ్మీ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి రానున్నాయి. ఈ బ్రాండ్ రెడ్మీ నోట్(Note) 11, 11ఎస్ పేరుతో కొత్త మొడల్స్ (new models)ను ఫిబ్రవరిలో(February) లాంచ్ చేయనుంది. ఫిబ్రవరి 9 నుంచి ఈ మొబైల్స్ అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో రానున్న ఈ మోడల్స్ ఫీచర్ల (features)ను, ధరల (price)ను ఇప్పుడు తెలుసుకుందాం.
రెడ్మీ నోట్ 11 ఎస్ ధర
రెడ్మీ 11 ఎస్ మూడు వేరియంట్లలో లభించనుంది. 6 జీబీ రామ్+64 జీబీ మొబైల్ ధర రూ. 18,600 ఉండగా.. 6 జీబీ రామ్+128 జీబీ వేరియంట్ రూ. 20,900, 8 జీబీ రామ్+128 జీబీ డివైజ్ రూ. 22,400 ధరకు అందుబాటులో ఉంటాయి. ఈ మోడల్ గ్రే, వైట్, బ్లూ కలర్స్‌లో కస్టమర్ల కోసం అందుబాటులోకి రానుంది.
రెడ్మీ నోట్ 11 ధర
రెడ్మీ 11 కూడా మూడు వేరియంట్లలో లభించనుంది. 4 జీబీ రామ్+64 జీబీ మొబైల్ ధర రూ. 13,400.. 4 జీబీ రామ్+128 జీబీ వేరియంట్ ధర రూ. 14,900, 6 జీబీ రామ్+128 జీబీ వేరియంట్ రూ.17,200కు అందుబాటులో ఉంటాయి. ఫ్రంట్ కెమెరాతో పాటు రియర్‌లో క్వాడ్ కెమెరాలు ఉండే ఈ మోడల్ గ్రే, వైట్, బ్లూ కలర్స్‌లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉండనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.