Redmi Note 11 Series: రెడ్‌మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... 15 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్

Redmi Note 11 Series: రెడ్‌మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్... 15 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్

Redmi Note 11 Series | షావోమీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 11 (Redmi Note 11), రెడ్‌మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro), రెడ్‌మీ నోట్ 11 ప్రో+ (Redmi Note 11 Pro+) స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో (Redmi Note 11 Series) మూడు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 11 (Redmi Note 11), రెడ్‌మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro), రెడ్‌మీ నోట్ 11 ప్రో+ (Redmi Note 11 Pro+) మోడల్స్‌ని చైనాలో రిలీజ్ చేసింది షావోమీ. ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా ఈ మూడు స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది కంపెనీ. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌కు అప్‌గ్రేడ్ మోడల్స్ ఈ మూడు స్మార్ట్‌ఫోన్స్. ఈ మూడు స్మార్ట్‌ఫోన్లు మొదటిసారిగా చైనాలో రిలీజ్ అయ్యాయి. అయితే ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు. ఇప్పటికే ఇండియాలో రెడ్‌మీ నోట్ 10 సిరీస్ అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 మ్యాక్స్ , రెడ్‌మీ నోట్ 10టీ 5జీ, రెడ్‌మీ నోట్ 10ఎస్ మోడల్స్ లభిస్తున్నాయి. ఇండియాలోని షావోమీ ఫ్యాన్స్ కూడా రెడ్‌మీ నోట్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

    Flipkart Big Diwali Sale: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? ఇవే బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్

    రెడ్‌మీ నోట్ 11 ఫీచర్స్


    రెడ్‌మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉండగా సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రెడ్‌మీ నోట్ 10 ప్రారంభ ధర సుమారు రూ.14,000. ఇది 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.15,200, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.17,500, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.19,800 ఉండొచ్చని అంచనా.

    Mi 11X Pro 5G: రూ.39,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.15,000 లోపే... ఆఫర్ ఇంకొన్ని రోజులే

    రెడ్‌మీ నోట్ 11 ప్రో ఫీచర్స్


    రెడ్‌మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. ఇక రెడ్‌మీ నోట్ 10 ప్రో ప్రారంభ ధర సుమారు రూ.18,700. ఇది 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.22,200, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.24,500 ఉండొచ్చని అంచనా.

    Flipkart Big Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.25 వేల లోపు 10 బెస్ట్ స్మార్ట్ టీవీలు ఇవే

    రెడ్‌మీ నోట్ 11 ప్రో+ ఫీచర్స్


    రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ఏఐ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. డాల్బీ అట్రామ్ సపోర్ట్‌తో జేబీఎల్ స్పీకర్స్ ఉంటాయి. మరోవైపు రెడ్‌మీ నోట్ 10+ ప్రో ప్రారంభ ధర సుమారు రూ.22,200. ఇది 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.24,500, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.26,900 ఉండొచ్చని అంచనా.
    Published by:Santhosh Kumar S
    First published: