హోమ్ /వార్తలు /technology /

MediaTek Helio G96: మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో నాలుగు స్మార్ట్‌ఫోన్లు... ఏది బెస్ట్ అంటే?

MediaTek Helio G96: మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో నాలుగు స్మార్ట్‌ఫోన్లు... ఏది బెస్ట్ అంటే?

MediaTek Helio G96 | గేమింగ్ స్మార్ట్‌ఫోన్ (Gaming Smartphone) కొనాలనుకునేవారికి చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రో , పోకో ఎం4 ప్రో 4జీ, రియల్‌మీ నార్జో 50, రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్లలో మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్ ఉంది. వీటిలో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్? తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

  ఇటీవల మీడియాటెక్ హీలియో జీ96 (MediaTek Helio G96) గేమింగ్ ప్రాసెసర్‌తో ఏకంగా నాలుగు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ అన్నీ ఈ ప్రాసెసర్‌తో వరుసగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేయడం విశేషం. లేటెస్ట్‌గా రిలీజైన రెడ్‌మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro) స్మార్ట్‌ఫోన్‌తో పాటు పోకో ఎం4 ప్రో 4జీ, రియల్‌మీ నార్జో 50, రెడ్‌మీ నోట్ 11ఎస్ మోడల్స్‌లో మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ ఉంది. ఇవన్నీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్స్ కావడం విశేషం. లేటెస్ట్‌గా రిలీజైన గేమింగ్ మొబైల్ కొనాలనుకునేవారికి చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్స్ అన్నీ రూ.20,000 లోపు బడ్జెట్‌లో (Smartphone Under Rs 20,000) రిలీజ్ కావడం విశేషం. మరి ఈ నాలుగు స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? మీ అవసరాలకు సూటయ్యే మొబైల్ ఏది? తెలుసుకోండి.

   స్పెసిఫికేషన్స్ రెడ్‌మీ నోట్ 11 ప్రోపోకో ఎం4 ప్రో 5జీ రియల్‌మీ నార్జో 50 రెడ్‌మీ నోట్ 11ఎస్
   డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డాట్ డిస్‌ప్లే
   ర్యామ్ 6జీబీ, 8జీబీ 4జీబీ, 6జీబీ, 8జీబీ 4జీబీ, 6జీబీ 6జీబీ, 8జీబీ
   ఇంటర్నల్ స్టోరేజ్ 128జీబీ 64జీబీ, 128జీబీ 64జీబీ, 128జీబీ 64జీబీ, 128జీబీ
   ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో జీ96  మీడియాటెక్ హీలియో జీ96 మీడియాటెక్ హీలియో జీ96 మీడియాటెక్ హీలియో జీ96
   రియర్ కెమెరా 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ లెన్స్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా సెన్సార్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ Samsung HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
   ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్
   బ్యాటరీ 5,000ఎంఏహెచ్ (67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) 5,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) 5,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) 5,000ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
   ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2 ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13
   సిమ్ సపోర్ట్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్ డ్యూయెల్ సిమ్
   కలర్స్ ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ, స్టీల్త్ బ్లాక్ పోకో ఎల్లో, కూల్ బ్లూ, పవర్ బ్లాక్ స్పీడ్ బ్లాక్, స్పీడ్ బ్లూ హొరైజన్ బ్లూ, పోలార్ వైట్, స్పేస్ బ్లాక్
  ధర6జీబీ+ 128జీబీ - రూ.17,999 8జీబీ + 128జీబీ - రూ.19,9994జీబీ + 64జీబీ - రూ.14,999 6జీబీ + 128జీబీ - రూ.16,499 8జీబీ + 128జీబీ - రూ.17,9994జీబీ + 64జీబీ - రూ.12,999 6జీబీ + 128జీబీ - రూ.15,4996జీబీ + 64జీబీ - రూ.16,499 6జీబీ + 128జీబీ - రూ.17,499 8జీబీ + 128జీబీ - రూ.18,499

  ఈ నాలుగు స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు చూస్తే రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11ఎస్, పోకో ఎం4 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్లలో అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. రెడ్‌మీ నోట్ 11 ప్రో, రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్‌ఫోన్లలో 108మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. పోకో ఎం4 ప్రో 4జీ మోడల్‌లో 64మెగాపిక్సెల్, రియల్‌మీ నార్జో 50 మొబైల్‌లో 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఇక రెడ్‌మీ నోట్ 11 ప్రో మాత్రమే 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మిగతా మూడు మోడల్స్‌లో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే ఉంది.

  First published:

  ఉత్తమ కథలు