ఇండియాలో రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ (Redmi Note 11 Pro + 5G), రెడ్మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro) స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ విశేషాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో రిలీజైతే రెడ్మీ నోట్ 11 ప్రో మాత్రం ఇటీవల పాపులర్ అయిన మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో రిలీజైంది. దీంతో పాటు ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120Hz సూపర్ అమొలెడ్ డిస్ప్లే, 108మెగాపిక్సెల్ ప్రో-గ్రేడ్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది 4జీ స్మార్ట్‌ఫోన్ మాత్రమే. ఒకవేళ 5జీ నెట్వర్క్ వచ్చాక 5జీ సిమ్ ఉపయోగించాలనుకుంటే రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ మోడల్ కొనొచ్చు.
రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999. ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. మార్చి 23న సేల్ ప్రారంభం కానుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌తో పాటు షావోమీ అధికారిక వెబ్సైట్, ఎంఐ స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు.
iPhone SE 2022: యాపిల్ నుంచి చీపెస్ట్ ఐఫోన్ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే
#BestGetsBetter on 23rd March, when the #RedmiNote11Pro will be yours to take.
6GB + 128GB ⏩ ₹17,999*.
8GB + 128GB ⏩ ₹19,999*.
🛒https://t.co/cwYEXedZWw | Mi Home | @amazonIN | Retail Store pic.twitter.com/qf6heLXtga
— Redmi India (@RedmiIndia) March 9, 2022
రెడ్మీ నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్స్
రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ పోకో ఎం4 ప్రో 5జీ, రియల్మీ నార్జో 50, రెడ్మీ నోట్ 11ఎస్ మోడల్స్‌లో ఉంది.
Poco M4 Pro 4G: పోకో ఎం4 ప్రో 4జీ సేల్ మొదలైంది... నెలకు రూ.572 చెల్లిస్తే చాలు
రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లతో వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్, బ్లూటూత్ 5.1, డ్యూయెల్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Smartphone