హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi Price Cut: రెడ్‌మి ఫోన్‌పై 3 అదిరిపోయే ఆఫర్లు.. చౌక ధరకే 5జీ ఫోన్ కొనేయండిలా!

Redmi Price Cut: రెడ్‌మి ఫోన్‌పై 3 అదిరిపోయే ఆఫర్లు.. చౌక ధరకే 5జీ ఫోన్ కొనేయండిలా!

Redmi Price Cut: రెడ్‌మి ఫోన్‌పై 3 అదిరిపోయే ఆఫర్లు.. చౌక ధరకే 5జీ ఫోన్ కొనేయండిలా!

Redmi Price Cut: రెడ్‌మి ఫోన్‌పై 3 అదిరిపోయే ఆఫర్లు.. చౌక ధరకే 5జీ ఫోన్ కొనేయండిలా!

Redmi Smartphones | 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. కంపెనీ తాజాగా ఒక ఫోన్‌పై ధర తగ్గించింది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్ వంటివి కూడా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Xiaomi Smartphones | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. షావోమి అదిరే తీపికబురు అందించింది. పాపులర్ స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించేసింది. రెడ్‌మి నోట్ 11 ప్రో ప్లస్ (Redmi Note 11 Pro Plus) ఫోన్‌ ధరలో కోత విధించింది. 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 1000 తగ్గింది. అలాగే 8 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ. 2 వేలు దిగి వచ్చింది. దీంతో 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ ఫోన్ రేటు రూ. 19,999గా ఉంది. అలాగే 8 జీబీ ర్యామ్ ఫోన్ (Phone) ధర రూ. 20,999గా ఉంది. ఇది 128 జీబీ మెమరీకి వర్తిస్తుంది. అదే 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్ అయితే రూ. 22,999కు కొనాల్సి ఉంది. దీని రేటు ఇంతకు ముందు రూ. 24,999గా ఉంది.

ధర తగ్గింపు నిర్ణయంతో పాటు ఈ ఫోన్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ. 1500 తక్షణ తగ్గింపు వస్తుంది. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఫోన్‌పై రూ. 16,500 వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంటే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద తక్కువ రేటుకే ఫోన్ కొనొచ్చు.

కొత్త ఇల్లు కొనే వారికి బంపరాఫర్.. బజాజ్ రూ.4,999 ఈఎంఐ స్కీమ్!

అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్ మోడల్, కండీషన్ ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. అందువల్ల కొన్ని ఫోన్లపై ఎక్స్చేంజ్ డిస్కౌంట్ తక్కువగా కూడా ఉండొచ్చు. ఇకపోతే ఈ 5జీ ఫోన్‌లో 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా వ్యవస్థ, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 6.67 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్, హ్యాండ్స్ ఫ్రీ అలెక్సా, గొరిల్లా గ్లాస్ 5, స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కస్టమర్లకు అందుబాటులో ఉంది. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో కూడా మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

100 ఏళ్లు పూర్తి చేసుకున్న బ్యాంక్.. కస్టమర్లకు అదిరే గిఫ్ట్!

అంతేకాకుండా ఈ ఫోన్‌పై మరో ఆఫర్ కూడా ఉంది. జెస్ట్ మనీ ద్వారా ఈ ఫోన్ కొంటే రూ. 3 వేలు వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఇ:కా సున్నా వడ్డీకే లోన్ వస్తుంది. ఇంకా ఈ ఫోన్‌ను ఈఎంఐ ఆప్షన్ కింద కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ.1000 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది.

First published:

Tags: 5g phones, 5G Smartphone, Redmi, Xiaomi

ఉత్తమ కథలు