షావోమీ ఇండియా రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ (Redmi Note 11 Pro Series) రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు రూ.20,000 బడ్జెట్లో (Smartphone Under Rs 20,000) రిలీజ్ కావడం విశేషం. గతేడాది పాపులర్ అయిన రెడ్మీ నోట్ 10 ప్రో సిరీస్ అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఈ రెండు మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్ఫోన్లలో స్పెసిఫికేషన్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. కొన్ని స్పెసిఫికేషన్స్‌లో తేడాలు ఉన్నాయి. అందుకే వీటి ధరలు కూడా ఆ తేడా కనిపిస్తోంది. రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్ఫోన్లలో ఒకేలా ఉన్న ఫీచర్స్ ఏంటీ? ఎందులో ఫీచర్స్ బాగున్నాయి? మీ అవసరాలకు వీటిలో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్? తెలుసుకోండి.
స్పెసిఫికేషన్స్ | రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ | రెడ్మీ నోట్ 11 ప్రో |
డిస్ప్లే | 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే | 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే |
ర్యామ్ | 6జీబీ, 8జీబీ | 6జీబీ, 8జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 128జీబీ, 256జీబీ | 128జీబీ, 256జీబీ |
ప్రాసెసర్ | క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ | మీడియాటెక్ హీలియో జీ96 |
రియర్ కెమెరా | 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ | 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో + 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ |
ఫ్రంట్ కెమెరా | 16మెగాపిక్సెల్ | 16మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 5,000ఎంఏహెచ్ (67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) | 5,000ఎంఏహెచ్ (67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 | ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 |
సిమ్ సపోర్ట్ | హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ | హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్ |
కలర్స్ | ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ, స్టీల్త్ బ్లాక్ | ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ, స్టీల్త్ బ్లాక్ |
ధర | 6జీబీ+128జీబీ- రూ.19,9998జీబీ+128జీబీ- రూ.21,9998జీబీ+256జీబీ- రూ.23,999 | 6జీబీ+128జీబీ- రూ.17,9998జీబీ+128జీబీ- రూ.19,999 |
Poco M4 Pro 4G: పోకో ఎం4 ప్రో 4జీ సేల్ మొదలైంది... నెలకు రూ.572 చెల్లిస్తే చాలు
రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ, రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్ఫోన్లలో డిస్ప్లే, ఫ్రంట్ కెమెరా, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్, సిమ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ కామన్‌గా ఉన్నాయి. రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్‌కు 5జీ నెట్వర్క్ సపోర్ట్ ఉంటుంది. రెడ్మీ నోట్ 11 ప్రో 4జీ స్మార్ట్‌ఫోన్. ఇక రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉండగా, రెడ్మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఇటీవల పాపులర్ అయిన మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Smartphone