హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi Note 11 Pro+ 5G: లేటెస్ట్ ప్రాసెసర్, 108MP కెమెరాతో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

Redmi Note 11 Pro+ 5G: లేటెస్ట్ ప్రాసెసర్, 108MP కెమెరాతో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

Redmi Note 11 Pro+ 5G: లేటెస్ట్ ప్రాసెసర్, 108MP కెమెరాతో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
(image: Redmi India)

Redmi Note 11 Pro+ 5G: లేటెస్ట్ ప్రాసెసర్, 108MP కెమెరాతో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది (image: Redmi India)

Redmi Note 11 Pro+ 5G | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో (Redmi Note 11 Pro Series) రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ మొబైల్ రిలీజైంది. ధర, ఫీచర్స్ తెలుసుకోండి.

షావోమీ ఇండియా నుంచి భారతదేశంలో రెడ్‌మీ నోట్ 11 ప్రో సిరీస్ (Redmi Note 11 Pro Series) స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. ఈ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది షావోమీ. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ (Redmi Note 11 Pro + 5G), రెడ్‌మీ నోట్ 11 ప్రో (Redmi Note 11 Pro) స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. గతేడాది బాగా పాపులర్ అయిన రెడ్‌మీ నోట్ 10 ప్రో సిరీస్ అప్‌గ్రేడ్ వర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్లు రావడం విశేషం. రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ, రెడ్‌మీ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్లలో ఫీచర్స్ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. వీటిలో రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు చూస్తే ఇందులో లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 120Hz సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 108మెగాపిక్సెల్ ప్రో-గ్రేడ్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ ధర


రెడ్‌మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ మోడల్ ధర రూ.23,999. ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. మార్చి 15న సేల్ ప్రారంభం కానుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌తో పాటు షావోమీ అధికారిక వెబ్‌సైట్, ఎంఐ స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు.

Poco M4 Pro 4G: పోకో ఎం4 ప్రో 4జీ సేల్ మొదలైంది... నెలకు రూ.572 చెల్లిస్తే చాలు


రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్పెసిఫికేషన్స్


రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్. ఇది ఇటీవల బాగా పాపులర్ అయిన ప్రాసెసర్. ఇదే ప్రాసెసర్ వివో టీ1, రియల్‌మీ 9 ప్రో, మోటో జీ71 మోడల్స్‌లో ఉండటం విశేషం.

Samsung Galaxy F23 5G: స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, భారీ బ్యాటరీతో సాంసంగ్ నుంచి 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 108మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

రెడ్‌మీ నోట్ 11 ప్రో+ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. రెడ్‌మీ నోట్ ప్రో సిరీస్‌లో ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న మోడల్ కూడా ఇది. గతంలో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే లభించేది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్, బ్లూటూత్ 5.1, డ్యూయెల్ స్పీకర్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Smartphone

ఉత్తమ కథలు