Home /News /technology /

Redmi Note 11: కొత్త పేరుతో ఇండియాలోకి విడుదల కానున్న రెడ్​మీ నోట్11.. వివరాలివే

Redmi Note 11: కొత్త పేరుతో ఇండియాలోకి విడుదల కానున్న రెడ్​మీ నోట్11.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

షియోమి(Xiomi) సంస్థ గత వారం రెడ్​మీ నోట్​ 11(Redmi Note 11) సిరీస్​ను చైనా(China)లో లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్​లో రెడ్​మీ నోట్​11, రెడ్​మీ నోట్​ 11 ప్రో, రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్​ వంటి మూడు ఫోన్లు విడుదలయ్యాయి.

చైనా స్మార్ట్​ఫోన్​ దిగ్గజం షియోమి(Xiomi) భారత మార్కెట్​(Indian Market)లో దూసుకుపోతుంది. ఇప్పటికే స్మార్ట్​ఫోన్(Smartphone)​ మార్కెట్​లో అగ్రగామి సంస్థగా నిలిచింది. ఇప్పుడు ఇదే స్పీడ్​తో వరుసగా స్మార్ట్​ఫోన్లు విడుదల చేస్తుంది. షియోమి సంస్థ గత వారం రెడ్​మీ నోట్​ 11 సిరీస్​(Redmi Note 11 Series)ను చైనాలో లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్​లో రెడ్​మీ నోట్​11, రెడ్​మీ నోట్​ 11 ప్రో, రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్​ వంటి మూడు ఫోన్లు విడుదలయ్యాయి. అక్కడ ఈ సిరీస్​కు ఊహించని రెస్పాన్స్​ వస్తోంది. విడుదలైన గంటలోపే 5 లక్షల స్మార్ట్​ఫోన్లు బుక్​ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఇవే ఫోన్లను పేరు మార్చి ఇతర దేశాల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. యూరోపియన్​ మార్కెట్​లో పోకో ఎం4 ప్రో 5జీ పేరుతో, భారత మార్కెట్​లో మాత్రం రెడ్‌మీ నోట్ 11 టీ పేరుతో అరంగేట్రం చేయడానికి సిద్ధమవుతోన్నట్లు సమాచారం.

టిప్‌స్టర్ Kacper Skrzypek (@kacskrz) ప్రకారం, షియోమి భారతదేశంలో రెడ్​మీ నోట్​ 11 5జీని రెడ్​మీ నోట్​11టీ 5జీ పేరుతో ఆవిష్కరించనుంది. దీంతో రెడ్​మీ నోట్​ 11 ప్రో భారత్​లో షియోమి 11ఐ పేరుతో లాంచ్​ అవ్వనుంది. మరోవైపు రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్​ భారత్​లో షియోమి 11ఐ పేరుతో విడుదల కానుంది. అయితే భారతదేశంలో రెడ్​మీ నోట్​ 11 సిరీస్ లాంచ్, బ్రాండింగ్ గురించి షియోమి నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
Smart Phones: నవంబర్‌లో మార్కెట్‌లోకి కొత్త ఫోన్లు.. జాబితాలో వన్‌ప్లస్ 9RT, ఐకూ 8 సిరీస్

రెడ్​మీ నోట్​ 11 5జీ స్పెసిఫికేషన్లు..
రెడ్​మీ నోట్​ 11 సిరీస్​లో రెడ్​మీ నోట్​ 11 5జీ, రెడ్​మీ నోట్​11 ప్రో, రెడ్​మీ నోట్​11 ప్రో ప్లస్​ మూడు స్మార్ట్​ఫోన్లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఫాస్ట్​ ఛార్జింగ్​ మినహా మిగతా అన్ని ఫీచర్లు ఒకే రకంగా ఉంటాయి. స్పెసిఫికేషన్ల పరంగా చూస్తే.. వనిల్లా రెడ్‌మి నోట్ 11 స్మార్ట్​ఫోన్​ 6.6 అంగుళాల ఫుల్​ హెచ్​డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మీడియా టెక్​ డైమెన్సిటీ 810 ఎస్​ఓసీ ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్​, 128 జీబీ ఇంటర్నల్​ స్టోరేజ్​ వంటివి అందించింది.
Maxima Smartwatch: మాక్సిమా నుంచి కొత్త స్మార్ట్‌వాచ్‌.. రూ.3,999కే టాప్ ఫీచర్లతో మ్యాక్స్ ప్రో ఎక్స్6 స్మార్ట్‌వాచ్

ఫోటోలు, వీడియోల కోసం, దీనిలో 50- మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8 -మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌తో కూడిన డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. సెల్ఫీల కోసం, ఫోన్ ముందు భాగంలో 16- మెగాపిక్సెల్ కెమెరాను చేర్చింది. ఈ స్మార్ట్​ఫోన్​ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 3.5mm ఆడియో జాక్, యూఎస్​బీ టైప్- సీ పోర్ట్ వంటివి అందించింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: 5G Smartphone, Redmi, Smartphones, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు