Home /News /technology /

Redmi Note 11 4G: రెడ్​మీ నోట్​ 11 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. కేవలం రూ. 12 వేల లోపే 50 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు

Redmi Note 11 4G: రెడ్​మీ నోట్​ 11 4జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. కేవలం రూ. 12 వేల లోపే 50 ఎంపీ కెమెరా, అదిరిపోయే ఫీచర్లు

తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 11 (ప్రతీకాత్మక చిత్రం)

తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 11 (ప్రతీకాత్మక చిత్రం)

RedMi Note 11: రెడ్​మీ నోట్​ 11 4జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇది 6 జీబీ ర్యామ్​తో జత చేసిన ఆక్టా-కోర్ మీడియా టెక్​ హీలియో G88 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

చైనీస్​ స్మార్ట్​బ్రాండ్​ (Smart Brand) రెడ్​మీ (RedMi) వరుసగా స్మార్ట్​ఫోన్లను (Smart Phones) లాంచ్​ చేస్తుంది. గత నెలలో రెడ్​మీ నోట్​ 11 (RedMi Note 11) సిరీస్​లో రెడ్​మీ నోట్​ 11 5జీ, రెడ్​మీ నోట్​ 11 ప్రో 5జీ, రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్ 5జీ ఫోన్లు విడుదల చేయగా.. ఇప్పుడు రెడ్​మీ నోట్​ 11 4జీ (Redmi Note 11 4G) మార్కెట్​లోకి తెచ్చింది. ఈ కొత్త మోడల్.. రెడ్‌మీ 10, రెడ్‌మీ 10 ప్రైమ్‌కు కొనసాగింపుగా విడుదలైంది. రెడ్​మీ నోట్​ 11 4జీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. ఇది 6 జీబీ ర్యామ్​తో జత చేసిన ఆక్టా-కోర్ మీడియా టెక్​ హీలియో G88 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

రెడ్​మీ నోట్​ 11 4జీ ధర, లభ్యత

రెడ్​మీ నోట్​ 11 4G ధర విషయానికి వస్తే.. దీని 4 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ CNY 999 (దాదాపు రూ. 11,700) వద్ద లభిస్తుంది. మరోవైపు, 6 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ CNY 1,099 (దాదాపు రూ. 12,800) వద్ద అందుబాటులో ఉంటుంది. రెడ్​మీ నోట్​ 11 4G వేరియంట్లు మొత్తం మూడు విభిన్న కలర్​ ఆప్షన్లలో లభిస్తాయి. డ్రీమీ క్లియర్ స్కై, మిస్టీరియస్ బ్లాక్‌ల్యాండ్, టైమ్ మోనోలాగ్ కలర్లలో అందుబాటులో ఉంటాయి. చైనాలో డిసెంబర్ 1 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. అయితే చైనా మినహా ఇతర దేశాల్లో ఈ మోడల్ ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై ఎటువంటి స్పష్టత లేదు.

Truecaller: ట్రూకాలర్ కొత్త యాప్.. ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ప్రత్యేకం.. లేటెస్ట్ ఫీచర్లు ఇవే




రెడ్​మీ నోట్ 11 4జీ స్పెసిఫికేషన్లు

రెడ్​మీ నోట్​ 11 4జీ ఆండ్రాయిడ్​ 11 MIUI 12.5 ఓఎస్​పై పనిచేస్తుంది. ఇది 6.5 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్​ హీలియో G88 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనిలో 8 -మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌తో పాటు 50- మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరాలను అందించింది. మరోవైపు, 2- మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ కెమెరాను సైతం చేర్చింది. సెల్ఫీలు, వీడియో చాటింగ్​ల కోసం దీని ముందు భాగంలో 8 -మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను అందించింది. కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 4జీ, వైఫై, బ్లూటూత్ v5.1, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్​) బ్లాస్టర్, జీపీఎస్​, యూఎస్​బీ టైప్- సీ పోర్ట్ వంటివి చేర్చింది. రెడ్​మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:

Tags: Redmi, Smart phone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు