Home /News /technology /

Redmi Note 11 4G: త్వరలోనే భారత మార్కెట్​లోకి రెడ్​మీ నోట్​ 11 4G ఫోన్ లాంచ్​.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

Redmi Note 11 4G: త్వరలోనే భారత మార్కెట్​లోకి రెడ్​మీ నోట్​ 11 4G ఫోన్ లాంచ్​.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెడ్​మీ నోట్​ 11 4జీ మొత్తం మూడు మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. 4 జీబీ ర్యామ్​+64 జీబీ స్టోరేజ్​, 4 జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్​, 6 జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్​ ఆప్షన్లలో లభిస్తుంది.

షియోమి సబ్​బ్రాండ్​ రెడ్​మీ ఇటీవల వరుసగా స్మార్ట్​ఫోన్లు రిలీజ్​ చేస్తూ దూకుడుమీదుంది. గత వారంలో రెడ్​మీ నోట్ 11టీ 5జీ మోడల్‌ను లాంచ్​ చేసిన రెడ్​మీ.. అతి త్వరలోనే రెడ్​మీ నోట్ 11 4G స్మార్ట్‌ఫోన్ లాంచింగ్​కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్​ను చైనా మార్కెట్​లోకి తెచ్చింది. అక్కడ మంచి రెస్పాన్స్​ రావడంతో భారత్​లో లాంచింగ్​కు సిద్ధమవుతోంది. ఈ స్మార్ట్​ఫోన్​ భారత్​లో రాకను 91మొబైల్స్ ప్లాట్‌ఫాం ధ్రువీకరించింది. ఇటీవల రిలీజైన రెడ్​మీ నోట్​ 11టీ 5జీ తర్వాత దేశంలో రెండవ నోట్ 11- సిరీస్ ఫోన్ ఇదే కానుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ధర, స్పెసిఫికేషన్లను పరిశీలిద్దాం.

రెడ్​మీ నోట్​ 11 4జీ వేరియంట్లు
రెడ్​మీ నోట్​ 11 4జీ మొత్తం మూడు మోడళ్లలో అందుబాటులో ఉంటుంది. 4 జీబీ ర్యామ్​+64 జీబీ స్టోరేజ్​, 4 జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్​, 6 జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజ్​ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గ్రాఫైట్ గ్రే, ట్విలైట్ బ్లూ, స్టార్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే, ఈ వేరియంట్ల ధరపై మాత్రం ఇంకా స్పష్టత లేదు.

రెడ్​మీ నోట్​ 11 4జీ స్పెసిఫికేషన్లు
రెడ్​మీ నోట్​ 11 4జీ 90Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.5 -అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ ఎల్​సీడీ డిస్​ప్లేతో వస్తుంది. ఇది మీడియాటెక్​ హీలియో G88 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 6 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​లో లభిస్తుంది. మైక్రో ఎస్​డీ కార్డ్ సహాయంతో స్టోరేజ్​ను మరింత విస్తరించవచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​ ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 12.5 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, 3.5mm ఆడియో జాక్, ఐఆర్​ బ్లాస్టర్ వంటివి చేర్చింది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్, 9W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ గల 5,000mAh బ్యాటరీతో వస్తుంది.

Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

కనెక్టివిటీ ఫీచర్ల పరంగా చూస్తే.. 4జీ, వైఫై, బ్లూటూత్ 4.1, ఐఆర్​ బ్లాస్టర్, యూఎస్​బీ టైప్- సీ పోర్ట్ వంటివి అందించింది. కెమెరా ఫీచర్లను పరిశీలిస్తే.. దీని వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 50 ఎంపీ మెయిన్​ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్, 2 ఎంపీ మాక్రో కెమెరాను చేర్చింది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం ప్రత్యేకంగా 8 ఎంపీ స్నాపర్ కెమెరాను అందించింది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Redmi

తదుపరి వార్తలు