హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi Note 10T 5G: రెడ్​మీ నోట్ 10టి 5జి లాంచింగ్ డేట్ ఫిక్స్.. భారత మార్కెట్​లోకి ఎప్పుడంటే?  

Redmi Note 10T 5G: రెడ్​మీ నోట్ 10టి 5జి లాంచింగ్ డేట్ ఫిక్స్.. భారత మార్కెట్​లోకి ఎప్పుడంటే?  

Redmi Note 10T 5G

Redmi Note 10T 5G

Redmi Note 10T 5G to launch in India on July 20: స్మార్ట్​ఫోన్​ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెడ్‌మి నోట్ 10టి 5 జి రిలీజ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్​లోకి విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్​ జూలై 20న భారత మార్కెట్​లోకి లాంచ్​ కానుంది.

ఇంకా చదవండి ...

Redmi Note 10T 5G to launch in India on July 20: స్మార్ట్​ఫోన్​ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రెడ్‌మి నోట్ 10టి 5 జి రిలీజ్​ డేట్​ ఫిక్స్​ అయ్యింది. ఇప్పటికే గ్లోబల్​ మార్కెట్​లోకి విడుదలైన ఈ స్మార్ట్​ఫోన్​ జూలై 20న భారత మార్కెట్​లోకి లాంచ్​ కానుంది. రెడ్‌మి సంస్థ నుంచి వస్తోన్న మొట్టమొదటి 5 జి ఎనేబుల్ స్మార్ట్​ఫోన్​ కావడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్‌మి నోట్ 10 సిరీస్‌కి కొనసాగింపుగా ఇది విడుదలవుతోంది. కాగా, జూలై 20న ఈ స్మార్ట్​ఫోన్​ రిలీజ్​ కార్యక్రమాన్ని సంస్థ అధికారిక యూట్యూబ్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆ తర్వాత ఇది అమెజాన్, ఎంఐ.కామ్ ప్లాట్​ఫామ్​ల ద్వారా అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ప్రమోషన్​లో భాగంగా ఎంఐ.కామ్‌లో ఒక ప్రత్యేకమైన ఈవెంట్​ను నిర్వహిస్తోంది. ఈ మేరకు కంపెనీ తన అధికారిక ట్విట్టర్​ పేజీలో పోస్ట్​ చేసింది.

రెడ్‌మి నోట్ 10 టి 5జి స్పెసిఫికేషన్లు

రెడ్‌మి నోట్ 10టి 6.5 -అంగుళాల ఎఫ్‌హెచ్‌డి + డాట్ డిస్​ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20: 9 ఆస్పెక్ట్​ రేషియో, 1100 నిట్స్ బైట్​నెస్​ కలిగి ఉంటుంది. ఇది మాలి-జి 57 ఎంసి 2 జిపియూతో జత చేసిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్​తో పనిచేస్తుంది.ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11-ఆధారిత MIUI 12 కస్టమ్ స్కిన్‌పై పనిచేస్తుంది. దీనిలోని 5,000WAA బ్యాటరీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే.. 5 జి, 4 జి ఎల్‌టిఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, ఛార్జింగ్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ వంటివి చేర్చింది. కెమెరా విషయానికి వస్తే.. రెడ్‌మి నోట్ 10 టి వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించారు. దీనిలో 48 ఎంపి ప్రైమరీ కెమెరా, 2 ఎంపి మాక్రో లెన్స్, 2 ఎంపి డెప్త్ సెన్సార్ కెమెరా వంటివి చేర్చింది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం దీని ముందు భాగంలో ప్రత్యేకంగా 8MP స్నాపర్ కెమెరాను అందించింది. అదేవిధంగా సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా చేర్చింది. అయితే, రెడ్‌మి నోట్ 10 టి ధరను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఫోన్​ రష్యా వేరియంట్​తో సమానంగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్యన్​ మార్కెట్​లో 4జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ RUB 19,990 ధర వద్ద లభిస్తుంది. ఇదే ధర వద్ద భారత మార్కెట్​లో లాంచ్​ అయ్యే అవకాశం ఉంది.


ఇది చూడండి...


ఇది చూడండి...

First published:

Tags: 5G Smartphone, Smartphones

ఉత్తమ కథలు