Redmi Note 10T 5G: రెడ్‌మీ నుంచి తక్కువ ధరకే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ప్రత్యేకతలు ఇవే

Redmi Note 10T 5G: రెడ్‌మీ నుంచి తక్కువ ధరకే తొలి 5జీ స్మార్ట్‌ఫోన్... రెడ్‌మీ నోట్ 10టీ 5జీ ప్రత్యేకతలు ఇవే (image: Redmi India)

Redmi Note 10T 5G | ఇండియన్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రూ.15,000 లోపు రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది షావోమీ.

  • Share this:
    షావోమీకి చెందిన ఓ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన రెడ్‌మీ ఇండియా... తొలి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేసింది. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. షావోమీ నుంచి ఎంఐ సిరీస్‌లో 5జీ మొబైల్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కానీ రెడ్‌మీ సిరీస్‌లో మాత్రం తొలి 5జీ మోడల్ రిలీజ్ అయింది. రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రెడ్‌మీ నోట్ 10టీ 5జీ రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యూరప్‌లో రిలీజ్ అయిన రెడ్‌మీ నోట్ 10 5జీ, పోకో ఎం3 ప్రో 5జీ రీబ్రాండెట్ వర్షన్.

    రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రిలీజ్ అయింది. రెడ్‌మీ నోట్ 10టీ 5జీ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.13,999 కాగా, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999. జూలై 26న సేల్ మొదలవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్, షావోమీ ఇండియా వెబ్‌సైట్, ఎంఐ హోమ్ స్టోర్స్, ఆఫ్‌లైన్ రీటైలర్ల దగ్గర కొనొచ్చు.

    Oppo Reno 6 Pro 5G: కాసేపట్లో ఒప్పో రెనో 6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్... రూ.4,000 డిస్కౌంట్

    Dual WhatsApp: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్‌ మారిస్తే రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోవచ్చు


    రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండటం విశేషం. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1 వర్షన్, ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సీ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

    Unlimited Data Plans: అన్‌లిమిటెడ్ డేటా కావాలా? Jio, Airtel, Vi, BSNL ప్లాన్స్ ఇవే

    Earphones: ఆ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,29,990... షాకయ్యారా? ఎందుకో తెలుసుకోండి

    రెడ్‌మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్సులో 22.5వాట్ ఛార్జర్ ఇస్తోంది రెడ్‌మీ. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 190 గ్రాములు. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: