స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్‌మీ (Redmi) నుంచి వచ్చిన నోట్ 10 ఎస్ (Note 10S) ఫోన్ ధర ఇండియాలో కొంత వరకు తగ్గింది. షియోమి ఇండియా వెబ్‌సైట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈ డివైజ్‌పై కంపెనీ రూ. 2,000 వరకు ధర తగ్గించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుండగా, అన్నింటిపై ధరలు తగ్గాయి. అయితే ఈ ఆఫర్‌ను కంపెనీ లిమిటెడ్ పీరియడ్ డిస్కౌంట్‌గా అందిస్తోందా లేదా శాశ్వతంగా ధర తగ్గిందా అనేది అస్పష్టంగా ఉంది. అమెజాన్ ఇండియాలో ఈ ఫోన్ కొత్త ధరతో అందుబాటులో ఉంది. దీని కొనుగోలుపై అమెజాన్ బ్యాంక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. రెడ్‌మీ ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నవారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రెడ్‌మీ నోట్ 10S ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.
రెడ్‌మీ నోట్ 10S ధర
ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాది మే నెలలో లాంచ్ అయింది. అప్పట్లో 6GB + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ. 15,999గా ఉంది. 2021 డిసెంబర్‌లో కంపెనీ 8GB RAM, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 17,499గా ఉంది. ప్రస్తుతం బేస్ వేరియంట్‌పై కంపెనీ రూ. 2,000 ధర తగ్గించింది. కస్టమర్లు ఇప్పుడు ఈ డివైజ్‌ను రూ.12,999కే కొనుగోలు చేయవచ్చు. ధర తగ్గింపుతో 6GB RAM, 128GB స్టోరేజ్ ఆప్షన్ రూ. 14,999కి అందుబాటులో ఉండగా, టాప్ వేరియంట్ ధర కూడా రూ.2వేలు తగ్గింది.
అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి స్పెషల్ బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (EMI ఆప్షన్‌లో మాత్రమే) వంటి ఆఫర్‌లను పొందవచ్చు. దీంతోపాటు రూ.9,200 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. రెడ్‌మీ నోట్ 10S ఫోన్ డీప్ సీబ్లూ, కాస్మిక్ పర్పుల్, ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్ కలర్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
స్పెసిఫికేషన్లు
రెడ్‌మీ నోట్ 10S ఫోన్ ధర తక్కువే అయినా, కళ్లు చెదిరే ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ 2400x1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 409 PPI, 1100 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 120Hz 6.43-అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో G95 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ MIUI 12.5 ఓఎస్‌తో రన్ అవుతుంది. కస్టమర్‌లు 6GB LPDDR4X RAM, 8GB LPDDR4X RAM ఆప్షన్లతో ఫోన్‌ను ఎంచుకోవచ్చు. ఇది UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది.
ఈ ఫోన్ రియర్ కెమెరా మాడ్యూల్‌లో 64-మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్-యాంగిల్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2-మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. హోల్-పంచ్ కటౌట్ లోపల 13-మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అందించారు. ఇతర ఫీచర్లలో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ, IP53 రేటింగ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, AI ఫేస్ అన్‌లాక్, డ్యుయల్ స్పీకర్లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యుయల్ సిమ్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Redmi, Smart phones, Tech news, Xiomi