Home /News /technology /

Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త కలర్ వచ్చేసింది... ఫీచర్స్ ఇవే

Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త కలర్ వచ్చేసింది... ఫీచర్స్ ఇవే

Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త కలర్ వచ్చేసింది... ధర ఎంతంటే
(image: Redmi India)

Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త కలర్ వచ్చేసింది... ధర ఎంతంటే (image: Redmi India)

Redmi Note 10S | రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త కలర్ వేరియంట్‌లో రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    షావోమీ మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌కు పరిచయం చేసింది. ఇది పాత స్మార్ట్‌ఫోనే. కానీ కొత్త కలర్‌లో రిలీజ్ చేసింది. ఈ ఏడాది మేలో రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 10ఎస్ మోడల్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఫ్రాస్ట్ వైట్, షాడో బ్లాక్, మిడ్‌నైట్ బ్లూ కలర్స్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు కాస్మిక్ పర్పుల్ కలర్ వేరియంట్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ కూడా మొదలైంది. అమెజాన్, షావోమీ అధికారిక వెబ్‌సైట్, ఎంఐ హోమ్ స్టోర్‌లో రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను కాస్మిక్ పర్పుల్ కలర్‌లో కొనొచ్చు. రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

    SBI New Feature: మీరు ఎస్‌బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

    Samsung Galaxy M21: ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.749 ధరకే కొనొచ్చు... పూర్తి వివరాలివే


    రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌లో షావోమీ రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 10ఎస్. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. లేటెస్ట్‌గా రెడ్‌మీ నోట్ 10 ప్రో, రెడ్‌మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ల బేస్ వేరియంట్‌ను షావోమీ నిలిపివేసింది. త్వరలో రెడ్‌మీ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తుండటంతో రెడ్‌మీ నోట్ 10 బేస్ వేరియంట్లను నిలిపివేసినట్టు భావిస్తున్నారు. ఇప్పుడు రెడ్‌మీ నోట్ 10ఎస్ మోడల్‌ను కొత్త కలర్‌లో రిలీజ్ చేసింది.

    Jio Cashback Offer: జియో యూజర్లకు రూ.100 వరకు క్యాష్‌బ్యాక్... ఆఫర్ పొందండి ఇలా

    Dangerous Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 9 యాప్స్ డిలిట్ చేయండి

    రెడ్‌మీ నోట్ 10ఎస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ చూస్తే 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Mobile, Mobile News, Mobiles, Redmi, Smartphone, Smartphones, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు