Smartphones Price Hike: వినియోగదారులకు షాక్ ఇచ్చిన Xiomi, POCO.. ఆ రెండు మోడళ్ల ధరల పెంపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

Redmi Note 10 ధర మరో సారి పెరిగింది. ఈ ఫోన్ తో పాటు POCO M3 ధర కూడా పెరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ కీలక నిర్ణయం తీసుకుంది. Redmi Note 10 మోడల్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మోడల్ ధరను పెంచడం ఈ నెలలో ఇది రెండో సారి కావడం విశేషం. స్మార్ట్ ఫోన్ ను లాంఛ్ చేసిన తర్వాత ఈ ధర పెంచడం ఇది ఐదో సారి. Redmi Note 10 తో పాటు Poco M3 మోడల్ ధరను కూడా ఇండియాలో పెంచారు. రెడ్ మీ నోట్ 10 ధర రూ. 500 పెరగగా Poco M3 ధర కూడా అంతే మొత్తం పెరిగింది. అయితే.. షియోమి రెడ్ మీ నోట్ 10 బేస్ వేరియంట్ ధరను మాత్రమే పెంచింది. 6 GB+128 GB వేరియంట్ ధర లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. రెడ్ మీ నోట్ 10 బేస్ వేరియంట్ (4 GB+6 GB) 4GB ర్యామ్ ధర ప్రస్తుతం ఇండియాలో రూ.13,999గా ఉంది. ఈ ఫోన్ ను లాంఛ్ చేసిన సమయంలో దీని ధర రూ.11,999గా ఉంది.

    అంటే ఈ ఫోన్ ధర 16 శాతం పెరిగింది.ఈ నెల ప్రారంభంలో ఈ ఫోన్ ధర రూ. 500 పెరగగా ధర రూ. 13,499కి చేరింది. ఇప్పుడు మళ్లీ రూ. 500 పెంచడంతో ఆ ధర రూ. 13, 999కి పెరిగింది. ఈ కొత్త ధర వివరాలు ఇప్పటికే సంస్థ వెబ్ సైట్ తో పాటు, అమెజాన్ లోనూ మార్చబడింది. POCO M3 మోడల్ ధర రూ. 500 పెరగడంతో ఫోన్ ధర రూ. 11,999 కి చేరింది.
    Redmi Note 10 Pro Max: రూ.19,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.4,999 ధరకే కొనండి

    రెడ్‌మీ నోట్ 10 స్పెసిఫికేషన్స్:
    రెడ్ మీ నోట్ 10 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లేతో లభిస్తుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్ లు ఈ ఫోన్లో లభిస్తాయి. 64జీబీ, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 678 ప్రాసెసర్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ Sony IMX58 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000 mAh (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్). ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12. డ్యూయల్ సిమ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆక్వా గ్రీన్, షాడో బ్లాక్, ఫ్రాస్ట్ వైట్ కలర్లలలో ఈ ఫోన్ లభిస్తుంది.
    Published by:Nikhil Kumar S
    First published: