హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi K50i: తక్కువ ధరకే రెడ్‌మీ కే50ఐ రిలీజ్... డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా

Redmi K50i: తక్కువ ధరకే రెడ్‌మీ కే50ఐ రిలీజ్... డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా

Redmi K50i: తక్కువ ధరకే రెడ్‌మీ కే50ఐ రిలీజ్... డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా
(image: Redmi India)

Redmi K50i: తక్కువ ధరకే రెడ్‌మీ కే50ఐ రిలీజ్... డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా (image: Redmi India)

Redmi K50i | మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో రెడ్‌మీ కే50ఐ (Redmi K50i) మొబైల్ ఇండియాకు వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.25,000 లోపు బడ్జెట్‌లో రిలీజ్ కావడం విశేషం.

రెడ్‌మీ కే సిరీస్‌లో ఇండియాలో రెడ్‌మీ కే50ఐ (Redmi K50i) స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. గతంలో రెడ్‌మీ కే సిరీస్ స్మార్ట్‌ఫోన్లు బాగా పాపులర్ అయ్యాయి. ప్రస్తుతం రెడ్‌మీ కే సిరీస్‌లో ఇండియాలో మొబైల్స్ లేవు. దీంతో రెడ్‌మీ కే50ఐ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రెడ్‌మీ కే50ఐ మొబైల్ రూ.25,000 లోపు బడ్జెట్‌లో రిలీజైంది. ఇందులో డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 5,080mAh బ్యాటరీ, 64MP కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రెడ్‌మీ కే50ఐ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. జూలై 23న సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో కొనొచ్చు. షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా కొనొచ్చు.

రెడ్‌మీ కే50ఐ ఆఫర్స్


ఎర్లీ బర్డ్ ఆఫర్స్ ప్రకటించింది షావోమీ ఇండియా. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.3,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసేవారికి అదనంగా రూ.2,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రెడ్‌మీ కే50ఐ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.20,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.23,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మీ కే20 ప్రో యూజర్లు తమ మొబైల్ ఎక్స్‌ఛేంజ్ చేసి రూ.8,050 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫ్‌లైన్‌లో రెడ్‌మీ కే50ఐ కొనేవారికి రూ.4,999 విలువైన షావోమీ స్మార్ట్ స్పీకర్ ఉచితంగా లభిస్తుంది.

Vivo T1X: రూ.10,999 ధరకే వివో టీ1ఎక్స్ వచ్చేసింది... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 6GB వరకు ర్యామ్

రెడ్‌మీ కే50ఐ స్పెసిఫికేషన్స్


రెడ్‌మీ కే50ఐ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్ ఉండటం విశేషం. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

రెడ్‌మీ కే50ఐ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,080ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. 15 నిమిషాల్లో 50 శాతం, 46 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఫాంటమ్ బ్లూ, క్విక్ సిల్వర్, స్టీల్త్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి.

SBI Offer: ఎస్‌బీఐ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,000 డిస్కౌంట్... 12GB ర్యామ్, Sony IMX766 కెమెరా, డైమెన్సిటీ ప్రాసెసర్, మరెన్నో ఫీచర్స్

రెడ్‌మీ కే50ఐ మొబైల్‌తో పాటు రెడ్‌మీ బడ్స్ 3 లైట్ రిలీజ్ చేసింది షావోమీ. ధర రూ.1,999. షావోమీ ఇండియా వెబ్‌సైట్, ఎంఐ హోమ్, అమెజాన్, ఎంఐ స్టూడియోలో జూలై 31 నుంచి కొనొచ్చు. మొదటి 48 గంటల్లో కొనేవారికి రెడ్‌మీ బడ్స్ 3 లైట్ రూ.1,499 ధరకే లభిస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Redmi, Smartphone

ఉత్తమ కథలు