షావోమీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రెడ్‌మీ కే50 సిరీస్‌లో రెడ్‌మీ కే50 ప్రో (Redmi K50 Pro), రెడ్‌మీ కే50 (Redmi K50) మోడల్స్ పరిచయం చేసింది. మీడియాటెక్ ప్రాసెసర్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే, 5జీ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. రెడ్‌మీ కే50 ప్రో మొబైల్ మూడు నాలుగు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.35,900 కాగా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.39,500. ఇక 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.43,100 కాగా 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.47,900.
రెడ్‌మీ కే50 స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.28,700 కాగా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.31,100. ఇక 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.33,500. డిమ్ లైట్, ఫ్యాంటసీ, ఇంక్ ఫెదర్, సిల్వర్ ట్రేసెస్ కలర్స్‌లో లభిస్తుంది. చైనాలో మార్చి 22 నుంచి సేల్ మొదలవుతుంది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు.
Samsung Galaxy A Series: సాంసంగ్ ఏ సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు... ఫీచర్స్ ఇవే
రెడ్‌మీ కే50 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల సాంసంగ్ ఓలెడ్ 2కే డిస్‌ప్లే ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ కే50 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 100మెగాపిక్సెల్ Samsung S5KHM2 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ Sony IMX596 ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 19 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.
OnePlus: మరో సంచలనానికి వన్‌ప్లస్ రెడీ... రూ.20,000 బడ్జెట్‌లో రాబోతున్న స్మార్ట్‌ఫోన్ ఇదేనా?
రెడ్‌మీ కే50 ప్రో మొబైల్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్, సిమ్, డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ రెడ్‌మీ కే50 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ కే50 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 48మెగాపిక్సెల్ Sony IMX582 ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ Sony IMX596 ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 5,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.