షావోమీ మరో స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న Redmi K30S ఎక్స్ట్రీమ్ కమామొరేటివ్ ఎడిషన్‌ను ఆ సంస్థ చైనాలో విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ లెవల్ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్, 6.7 అంగుళాల డిస్ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ వంటి ఎన్నో ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. రెడ్మి కె30ఎస్‌ను కొత్త స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పరిచయం చేసింది. కానీ ఇది భారతదేశంలో అమ్ముతున్న Mi 10T ఫోన్‌కు రీబ్రాండెడ్ వెర్షన్ అని తెలుస్తోంది. Mi 10T ఫోన్‌ను ఈ నెల ప్రారంభంలో వన్‌ప్లస్ 8Tకి పోటీగా విడుదల చేశారు.
ఆన్లైన్ కార్యక్రమంలో విడుదల
షావోమీ రెడ్మి K30Sను ఆన్లైన్ ప్రెజెంటేషన్ ద్వారా లాంచ్ చేశారు. ఇంటర్స్టెల్లార్ బ్లాక్, మూన్లైట్ సిల్వర్ కలర్ వేరియంట్లలో, రెండు స్టోరేజ్ ఆప్షన్ల(128 జిబి, 256 జిబి)లో ఇది లభిస్తుంది. ఈ రెండూ 8 జిబి ర్యామ్‌తో పనిచేస్తాయి. 128 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 2,599 చైనీస్ యువాన్లు(సుమారు రూ. 28,600). 256 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర 2,799యువాన్లు (సుమారు రూ.30,800)గా ఉంది.
Flipkart Big Diwali sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 7 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
JioPhone: జియోఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్... రూ.50,000 గెలుచుకోండి ఇలా
రెండు స్టోరేజ్ ఆప్షన్లతో లభిస్తుంది
రెడ్మి కె30ఎస్ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే, 20: 9 యాస్పెక్ట్ రేషియో, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో లభిస్తుంది. ఇది అత్యధికంగా 650 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఈ ఫోన్‌కు రక్షణనిస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 865 చిప్సెట్ ద్వారా 8GB LPDDR5 ర్యామ్‌తో, ఆండ్రాయిడ్ 10 బేస్డ్ MIUI 12 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది.
సరికొత్త ఫీచర్లు
Redmi K30S స్మార్ట్‌ఫోన్‌ను ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రూపొందించారు. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. ముందు వైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఆకట్టుకుంటుంది. Redmi K30S స్పెసిఫికేషన్లు Mi 10Tని పోలి ఉన్నాయి. Mi 10T, Mi 10TPro మోడళ్లను అక్టోబర్ 15న లాంచ్ చేశారు. వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంచారు. Mi 10T ధర రూ.35,999. Mi 10T Pro ధర రూ.39,999. రెడ్మి కె 30 ఎస్ స్మార్ట్‌ఫోన్ Mi 10T మోడల్‌కు రీబ్రాండెడ్ కాబట్టి, వీటిని భారత్‌కు తీసుకువచ్చే అవకాశం లేదు.