Poco F2 Pro: ఇండియాకు రానున్న పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్‌ఫోన్... ప్రత్యేకతలివే

Poco F2 Pro | షావోమీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలో ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశముంది. పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్‌కు రానుంది.

news18-telugu
Updated: April 28, 2020, 4:21 PM IST
Poco F2 Pro: ఇండియాకు రానున్న పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్‌ఫోన్... ప్రత్యేకతలివే
Poco F2 Pro: ఇండియాకు రానున్న పోకో ఎఫ్2 ప్రో స్మార్ట్‌ఫోన్... ప్రత్యేకతలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
పోకో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. పోకో సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇండియాలో పోకో ఎఫ్1 సృష్టించిన సంచలనాల గురించి తెలిసిందే. ఆ తర్వాత పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూశారు. కానీ కంపెనీ మాత్రం పోకో ఎక్స్2 పేరుతో ఫోన్ రిలీజ్ చేసింది. రెడ్‌మీ కే30 రీబ్రాండెడ్ వర్షన్ ఇది. ఇప్పుడు కంపెనీ రెడ్‌మీ కే30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో ఎఫ్2 ప్రో పేరుతో ఇండియాలో లాంఛ్ చేయనుందన్న వార్తలొస్తున్నాయి. దీంతో పాటు రెడ్‌మీ కే30 ప్రో జూమ్ ఎడిషన్ కూడా లాంఛ్ అయ్యే అవకాశముంది. రెడ్‌మీ కే30 ప్రో జూమ్ ఎడిషన్, రెడ్‌మీ కే30 ప్రో స్మార్ట్‌ఫోన్ల మధ్య తేడాలు పెద్దగా లేవు. డ్యూయెల్ మోడ్ 5జీ, వైఫై 6 సపోర్ట్, ఎన్ఎఫ్‌సీ, టైప్ సీ పోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇండియాలో పోకో ఎఫ్2 ప్రో పేరుతో రిలీజ్ కాబోయే రెడ్‌మీ కే30 ప్రో స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉంటాయి.

పోకో ఎఫ్2 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ 256 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 865
రియర్ కెమెరా: 64+5+13+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,700 ఎంఏహెచ్ (33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11
కలర్స్: మూన్ లైట్ వైట్, స్కై బ్లూ, స్టార్ రింగ్ పర్పుల్, స్పేస్ గ్రే
ధర:
6జీబీ+128జీబీ- సుమారు రూ.32,500
8జీబీ+128జీబీ- సుమారు రూ.36,000
8జీబీ+256జీబీ- సుమారు రూ.40,000

ఇవి కూడా చదవండి:

మీ అకౌంట్‌లోకి రూ.1,500 వచ్చాయా? చెక్ చేయండి ఇలా

Prepaid Plans: జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే

WhatsApp: వాట్సప్ ఫార్వర్డ్ మెసేజెస్ 70% తగ్గాయి... ఎందుకంటే
First published: April 28, 2020, 4:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading