Smartphone: ఆ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది... 4 రోజులే ఆఫర్

Redmi K20 Pro | షావోమీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది కంపెనీ. రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది. ఈ తగ్గింపు కొన్ని రోజులు మాత్రమే.

news18-telugu
Updated: July 9, 2020, 6:09 PM IST
Smartphone: ఆ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది... 4 రోజులే ఆఫర్
Smartphone: ఆ స్మార్ట్‌ఫోన్ ధర రూ.2,000 తగ్గింది... 4 రోజులే ఆఫర్
  • Share this:
రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్ ధరను తగ్గించింది షావోమీ. 6జీబీ+128జీబీ వేరియంట్‌పై రూ.2,000 తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ అవకాశం కేవలం 4 రోజులు మాత్రమే. అంటే జూలై 13 వరకే తగ్గింపు ధరతో రెడ్‌మీ కే20 ప్రో కొనొచ్చు. ఆ తర్వాత మళ్లీ పాత ధరనే అమల్లోకి వస్తుంది. షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకే రెడ్‌మీ కే20 ప్రో లభిస్తోంది. ఇటీవల జీఎస్‌టీ పెరగడంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే కాంపిటీషన్ మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ధరల్ని తగ్గిస్తున్నాయి కంపెనీలు. రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.2,000 తగ్గడంతో ప్రస్తుతం రూ.24,999 ధరకే లభిస్తోంది. జూలై 13 వరకే ఈ ధర ఉంటుంది. రెడ్‌మీ కే20 ప్రో ప్రత్యేకతలు చూస్తే పాప్-అప్ సెల్ఫీ కెమెరా, ఇన్‌-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, పనోరమా సెల్ఫీ, డార్క్ మోడ్, అమొలెడ్ డిస్‌ప్లే, 91.9% స్క్రీన్-టు-బాడీ రేషియో లాంటి ఫీచర్లున్నాయి.

Poco M2 Pro: బడ్జెట్ సెగ్మెంట్‌లో రిలీజైన పోకో ఎం2 ప్రో... ధర ఎంతంటే

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి షాక్... ఎందుకంటే


రెడ్‌మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ బ్లాక్
ధర:
6జీబీ+128జీబీ- రూ.24,999
8జీబీ+256జీబీ- రూ.29,999
Published by: Santhosh Kumar S
First published: July 9, 2020, 6:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading