స్మార్ట్‌ఫోన్ (Smartphone) నిత్యావసర వస్తువులా మారింది. రోజువారీ పనుల్లో ఇది భాగమైంది. రోజంతా ఫోన్ వినియోగించాలనే ఉద్దేశంతో యూజర్లు స్మార్ట్‌ఫోన్లలో స్మార్ట్ ఛార్జింగ్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ (Advanced Features) ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు అడ్వాన్స్‌డ్ ఛార్జింగ్ ఫీచర్స్‌తో డివైజ్ లను తీసుకొస్తున్నాయి. షియోమి సబ్ బ్రాండ్ రెడ్‌మీ, తాజాగా స్మార్ట్‌ఫోన్ల కోసం 300W ఛార్జింగ్ టెక్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సెగ్మెంట్‌పై ఫోకస్ చేసింది. భవిషత్తులో మార్కెట్లోకి రానున్న తన అప్ కమింగ్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఈ కొత్త ఫీచర్ టీజర్‌ను తాజాగా షేర్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా కేవలం 5 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ కానుంది.
* 2 నిమిషాల 11 సెకన్లలో 50 శాతం ఛార్జ్
రెడ్ మీ(Redmi) చైనీస్ సోషల్ మీడియా యాప్ Weiboలో ఓ వీడియో ద్వారా ఛార్జింగ్ టెక్‌ను ప్రదర్శించింది. టెస్టింగ్ కోసం 4100mAh బ్యాటరీ ఉండే Redmi Note 12 డిస్కవరీ వేరియంట్‌ని ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌లో ఉపయోగించిన ఛార్జింగ్ టెక్ ద్వారా 2 నిమిషాల 11 సెకన్లలో 50 శాతం ఛార్జింగ్‌ను అందించింది. కంపెనీ క్లెయిమ్ చేసిన విధంగా ఇది 5 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయింది.
* స్క్రీన్ ఎడమ వైపున ఛార్జింగ్ రీడర్
ఈ ఛార్జింగ్ టెక్ పనితీరును చూపే వీడియో లో స్క్రీన్ ఎడమ వైపున ఛార్జింగ్ రీడర్ కనిపిస్తోంది. 5 నిమిషాల్లో పూర్తి బ్యాటరీని పొందిందని వీడియో హైలైట్ చేసింది. ఛార్జింగ్ వేగం 290W వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇది ఛార్జింగ్ టెక్ పనితీరుకు నిదర్శనమని కంపెనీ పేర్కొంది. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లలో 65 శాతం వరకు ఫాస్ట్ ఛార్జింగ్ అవుతుంది. ఆ తర్వాత ఛార్జింగ్ స్పీడ్ 100 W కి తగ్గుతుంటుంది. దీర్ఘకాలిక ఛార్జింగ్ సైకిల్స్ కోసం బ్యాటరీ లైఫ్ హెల్తీ గా ఉండడం కోసం కంపెనీలు ఇలా సెట్ చేస్తాయి.
* ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్
రెడ్‌మీ దీన్ని 300W ఇమ్మోర్టల్ సెకండ్ ఛార్జర్ అని పిలుస్తుంది. ఇది ఇప్పటికే కొన్ని షియోమి, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్న 120W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీకి భిన్నంగా కనిపిస్తుంది. ఆసక్తికరంగా, ఒరిజినల్ రెడ్‌మీ నోట్ 12 డిస్కవరీ ఎడిషన్ 210W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,300mAh బ్యాటరీతో ఉంటుంది. ఈ ఫోన్ 10 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో ఫుల్ ఛార్జింగ్ పొందడానికి ఫోన్ లోపల మూడు 100W ఫాస్ట్ ఛార్జింగ్ చిప్‌లు ఉంటాయి.
ఇది కూడా చదవండి : జాక్ డోర్స్ మాములోడు కాదుగా.. ట్విట్టర్‌కు పోటీగా బ్లూస్కైని దింపుతున్నాడు!
అయితే 300W ఛార్జింగ్ టెక్‌ను ప్రదర్శించడానికి ఈ ఫోన్‌ను మోడిఫై చేసి 4,100mAh బ్యాటరీతో టెస్టింగ్ చేశారు. ఈ ఛార్జింగ్ టెక్ లాంచ్ ప్లాన్స్‌పై రెడ్‌మీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇది లాంచ్ అయ్యేవరకు 240W ఫాస్ట్ ఛార్జింగ్‌టెక్‌తో రియల్‌మీ ఈ విభాగంలో ప్రముఖ బ్రాండ్‌గా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Charging, Redmi, Smartphones, Tech news