Home /News /technology /

REDMI INDIA LAUNCHES REDMI 10A SPORT SMARTPHONE SILENTLY IN INDIA KNOW ABOUT PRICE AND SPECIFICATIONS SS

Redmi Smartphone: సైలెంట్‌గా ఓ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ధర రూ.10,000 లోపే

Redmi Smartphone: సైలెంట్‌గా ఓ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ధర రూ.10,000 లోపే
(image: Redmi India)

Redmi Smartphone: సైలెంట్‌గా ఓ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... ధర రూ.10,000 లోపే (image: Redmi India)

Redmi 10A Sport | రూ.10,000 సెగ్మెంట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. షావోమీ ఇండియా నుంచి రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ (Redmi 10A Sport) మోడల్ రిలీజైంది.

స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త మొబైల్ లాంఛ్ చేయాలనుకుంటే వారం పది రోజుల ముందు నుంచే టీజర్లతో ప్రచారం చేస్తుంటాయి. లాంఛింగ్‌కు 10 రోజుల ముందు నుంచే హడావుడి కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్నిసార్లు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు సైలెంట్‌గా మొబైల్స్ లాంఛ్ చేస్తుంటాయి. రెడ్‌మీ ఇండియా ఇప్పుడు అదే పనిచేసింది. సైలెంట్‌గా ఓ మొబైల్‌ను లాంఛ్ చేసింది. రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ (Redmi 10A Sport) మోడల్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. రెడ్‌మీ 10 సిరీస్‌లో వచ్చిన మరో స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పటికే రెడ్‌మీ 10ఏ, రెడ్‌మీ 10 పవర్, రెడ్‌మీ 10, రెడ్‌మీ 10 ప్రైమ్ (Redmi 10 Prime) మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ వచ్చేసింది.

రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ ధర


రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్ ఒకే వేరియంట్‌లో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో లభిస్తోంది. ధర రూ.10,999. షావోమీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో సేల్ ప్రారంభమైంది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపే సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. చార్‌కోల్ బ్లాక్, సీ బ్లూ, స్లేట్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు.

Smartphone Offer: ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు రోజుల బ్యాటరీ లైఫ్... ఆఫర్ ధర రూ.10,000 లోపే


రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ స్పెసిఫికేషన్స్


రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ రెడ్‌మీ 10ఏ మొబైల్ లాగానే ఉన్నాయి. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రెడ్‌మీ 10ఏ మోడల్‌లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Vivo T1X: కాసేపట్లో వివో టీ1ఎక్స్ సేల్... రూ.10,999 ధరకే 6GB వరకు ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ

రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్‌లో 13మెగాపిక్సెల్ ఏఐ ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులో లభిస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తూ 4జీ నెట్వర్క్, బ్లూటూత్ 5.0, టైప్ సీ పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. రెడ్‌మీ 10ఏ స్పోర్ట్ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ సిమ్ + మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్ సపోర్ట్ ఉంది. మెమొరీ కార్డుతో 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.



ఇప్పటికే రెడ్‌మీ 10ఏ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,299 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, Mobile News, Mobiles, Smartphone

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు