హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi A1: రెడ్‌మీ నుంచి కొత్త సిరీస్... క్లీన్ ఆండ్రాయిడ్‌తో రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Redmi A1: రెడ్‌మీ నుంచి కొత్త సిరీస్... క్లీన్ ఆండ్రాయిడ్‌తో రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Redmi A1: రెడ్‌మీ నుంచి కొత్త సిరీస్... క్లీన్ ఆండ్రాయిడ్‌తో రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ రిలీజ్
(image: Redmi India)

Redmi A1: రెడ్‌మీ నుంచి కొత్త సిరీస్... క్లీన్ ఆండ్రాయిడ్‌తో రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ (image: Redmi India)

Redmi A1 | షావోమీ ఫ్యాన్స్‌కు ఎంఐ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఎక్స్‌పీరియెన్స్‌తో రెడ్‌మీ ఏ సిరీస్‌లో (Redmi A Series) తొలి స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీఏ1 వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

షావోమీ ఇండియా రెడ్‌మీ బ్రాండ్‌తో ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. రెడ్‌మీ ఏ1 (Redmi A1) మోడల్‌ను పరిచయం చేసింది. ఈ మొబైల్ కేవలం ఒకే వేరియంట్‌తో రిలీజైంది. ధర రూ.6,499. ఇందులో హీలియో ఏ22 ప్రాసెసర్, క్లీన్ ఆండ్రాయిడ్ 12 ఎక్స్‌పీరియెన్స్ ఉండటం విశేషం. రెడ్‌మీ నుంచి ఒకేసారి మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. రెడ్‌మీ 11 ప్రైమ్ 5జీ, (Redmi 11 Prime 5G), రెడ్‌మీ 11 ప్రైమ్ 4జీ మోడల్స్‌తో పాటు రెడ్‌మీ ఏ1 కూడా రిలీజైంది. ఎంట్రీలెవెల్ సెగ్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని రెడ్‌మీ ఏ1 మోడల్‌ను కొత్తగా పరిచయం చేసింది షావోమీ ఇండియా. తొలిసారి స్మార్ట్‌ఫోన్ ఉపయోగించాలనుకునేవారు లేదా సెకండ్ మొబైల్‌గా వాడుకోవాలనుకునేవారికి ఇది ఓ ఆప్షన్.

రెడ్‌మీ ఏ1 ధర

రెడ్‌మీ ఏ1 కేవలం 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో మాత్రమే రిలీజైంది. ధర రూ.6,499. సెప్టెంబర్ 9 సాయంత్రం 4 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు. ఎంఐ స్టోర్స్, రీటైల్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది. బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.


రెడ్‌మీ ఏ1 స్పెసిఫికేషన్స్


రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.52 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్‌తో ఇండియాలో ఇన్ఫీనిక్స్ హాట్ 12ఐ, టెక్నో స్పార్క్ గో 2022, నోకియా 2.3, వివో వై90 లాంటి మోడల్స్ ఉన్నాయి. 2జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ సపోర్ట్ లభిస్తుంది. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ పెంచుకోవచ్చు. డ్యూయెల్ సిమ్ కార్డ్స్ ఉపయోగించుకోవచ్చు. 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది.

రెడ్‌మీ ఏ1 స్మార్ట్‌ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తుండటం విశేషం. ఇందులో ఎలాంటి బ్లోట్‌వేర్, జంక్‌వేర్ ఉండదు. ఇందులో 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉండగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000mAh బ్యాటరీ ఉండగా, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

షావోమీ గతంలో ఎంఐ ఏ సిరీస్‌లో ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్‌తో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎంఐ ఏ3 స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయింది. ఎంఐ ఏ4 కోసం షావోమీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసారు. కానీ ఎంఐ ఏ సిరీస్‌ను ఆపేసింది షావోమీ. ఇప్పుడు రెడ్‌మీ ఏ సిరీస్‌ను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో మొదటి ఫోన్ వచ్చింది. అయితే ఇది ఎంట్రీ లెవెల్ మొబైల్ మాత్రమే. ఇందులో కూడా ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ ఉండటం విశేషం.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Redmi, Smartphone

ఉత్తమ కథలు