Redmi Go: షావోమీ నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో'... ధర రూ.4,499 మాత్రమే

Redmi Go Release | రెడ్‌మీ గో స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సప్, టిక్‌టాక్, యూట్యూబ్‌ లాంటి యాప్స్ అన్నీ లైట్‌వెయిట్ వర్షన్‌లో లభిస్తాయి. వాటిని ఏ ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చని చెబుతోంది షావోమీ.

news18-telugu
Updated: March 19, 2019, 2:56 PM IST
Redmi Go: షావోమీ నుంచి చవకైన స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో'... ధర రూ.4,499 మాత్రమే
Redmi Go: చవకైన స్మార్ట్‌ఫోన్ 'రెడ్‌మీ గో' రిలీజ్ చేసిన షావోమీ... ధర రూ.4,499 (image: @XiaomiIndia/twitter)
news18-telugu
Updated: March 19, 2019, 2:56 PM IST
#AapkiNayiDuniya... 'మీ కొత్త ప్రపంచం' పేరుతో అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది షావోమీ. కొంతకాలంగా టీజర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్న షావోమీ... ఎట్టకేలకు 'రెడ్‌మీ గో' స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారిని టార్గెట్ చేసింది షావోమీ. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అన్నీ బేసిక్‌గా ఉన్నాయి. ఓఎస్ కూడా ఆండ్రాయిడ్ లైట్ వర్షన్ 'ఆండ్రాయిడ్ గో'. గూగుల్ ఆండ్రాయిడ్ గో ఓఎస్‌తో షావోమీ రిలీజ్ చేసిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. స్టోరేజీ తక్కువే అయినా ఫోన్ పెర్ఫామెన్స్ విషయంలో ఏ లోటు ఉండదని చెబుతోంది షావోమీ. ఫేస్‌బుక్, వాట్సప్, టిక్‌టాక్, యూట్యూబ్‌ లాంటి యాప్స్ అన్నీ లైట్‌వెయిట్ వర్షన్‌లో లభిస్తాయి. వాటిని ఏ ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చని చెబుతోంది షావోమీ. మెమొరీ 128 జీబీ వరకు పెంచుకోవచ్చు. డ్యూయెల్ సిమ్ స్లాట్‌ ఉండటం మరో విశేషం. ఇరవైకి పైగా ప్రాంతీయ భాషల్ని సపోర్ట్ చేస్తుంది. హిందీ, ఇంగ్లీష్‌లో గూగుల్ అసిస్టెంట్‌ ఉపయోగించుకోవచ్చు. కెమెరా, వీడియో కాలింగ్ చక్కగా పనిచేస్తాయని చెబుతోంది షావోమీ. మార్చి 22న ఫ్లిప్‌కార్ట్‌తో పాటు mi.com వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది. జియో నుంచి రూ.2,200 క్యాష్‌బ్యాక్, 100 జీబీ డేటా బెనిఫిట్స్ లభిస్తాయి.



రెడ్‌మీ గో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 1280x720 పిక్సెల్స్
ర్యామ్: 1 జీబీ ర్యామ్
ఇంటర్నల్ స్టోరేజ్: 8 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 425
రియర్ కెమెరా: 8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లూ, బ్లాక్
ధర: రూ.4,499

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి 12 రోజులే గడువు... మార్చి 31 డెడ్‌లైన్

WhatsApp Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

PUBG vs Call of Duty: పబ్‌జీ లాంటి మరో గేమ్... ఆండ్రాయిడ్‌లో కాల్ ఆఫ్ డ్యూటీ

MI Pay: గూగుల్‌ పే, పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే'... రిలీజ్ చేసిన షావోమీ
First published: March 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...