Xiaomi ఇటీవల తన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Redmi A1 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అతి ప్రధానమైన ప్రత్యేకత విషయానికి వస్తే.. దాని అతి పెద్ద డిస్‌ప్లే.. ఇంకా తక్కువ ధరలో లభించే బెస్ట్ బ్యాటరీ. తక్కువ ధరలో గొప్ప ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం చూసే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. మీరు కూడా ఇలాంటి ఫోన్ కోసం ఎదురు చూస్తుంటే ఈ ఫోన్ గురించి తెలుసుకోండి. Xiaomi యొక్క Redmi A1 తక్కువ ధరకే అందుబాటులో వచ్చింది. Mi.comలో అందించిన సమాచారం ప్రకారం.. వినియోగదారులు Redmi A1ని రూ. 8,999కి బదులుగా రూ.6,499 ధరతో సొంతం చేసుకోవచ్చు. విశేషమేమిటంటే, ఈ ఫోన్‌పై కస్టమర్లకు రూ.2,500 తగ్గింపు కూడా అందుబాటులో ఉండడం.
Redmi A1 6.52-అంగుళాల HD + డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ మంచి గ్రిప్ ను కలిగి ఉండడమే కాకుండా స్టైలిష్ లుక్ ఉంటుంది. ఇందులో డార్క్ మోడ్ మరియు నైట్ లైట్ మోడ్ కూడా ఉన్నాయి. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే.. MediaTek Helio A22 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. Redmi A1 32GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇంకా దాని స్టోరేజ్ ను మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించవచ్చు.
Jio Plan: జియో కస్టమర్లకు బంపరాఫర్.. కేవలం రూ. 395కే 84 రోజుల ప్లాన్.. ఓ లుక్కేయండి
పవర్ కోసం.. Redmi A1లో 5000mAh బ్యాటరీ ఇవ్వబడింది. ఇది 10W ఛార్జర్‌తో వస్తుంది. ఇది 30 రోజుల స్టాండ్‌బై టైం, 17 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 30 గంటల వీడియో ప్లేబ్యాక్ సమయాన్ని కలిగి ఉంటుందని వెల్లడించారు.
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా..
ఇంకా ఈ ఫోన్ 8-మెగాపిక్సెల్ డ్యూయల్ AI కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. ఇది కాకుండా, Redmi A1లో 20 కంటే ఎక్కువ భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Redmi, Smartphone, Smartphones, Xiomi