హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi 9A: బ్యాటరీ ఎక్కువ... ధర తక్కువ... రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

Redmi 9A: బ్యాటరీ ఎక్కువ... ధర తక్కువ... రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది

Redmi 9A: బ్యాటరీ ఎక్కువ... ధర తక్కువ... రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది
(image: Redmi India)

Redmi 9A: బ్యాటరీ ఎక్కువ... ధర తక్కువ... రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది (image: Redmi India)

Redmi 9A | షావోమీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రెడ్‌మీ 9ఏ స్పెసిఫికేషన్స్, ధర, ఫీచర్స్ తెలుసుకోండి.

  తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రూ.8,000 లోపు ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌ను దృష్టిలో పెట్టుకొని షావోమీ ఇండియా తక్కువ ధరలో రెడ్‌మీ 9ఏ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. రెడ్‌మీ నుంచి ఏ సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్‌‌ఫోన్లను రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెడ్‌మీ 4ఏ, రెడ్‌మీ 5ఏ, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 7ఏ, రెడ్‌మీ 8ఏ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రెడ్‌మీ 9 సిరీస్‌లో భాగంగా రెడ్‌మీ 9ఏ పరిచయం చేసింది షావోమీ. 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రారంభ ధర రూ.6,799 మాత్రమే. 2జీబీ+32జీబీ, 3జీబీ+32జీబీ వేరియంట్లలో రెడ్‌మీ 9ఏ మోడల్ రిలీజైంది. అమెజాన్, ఎంఐహోమ్, Mi.com వెబ్‌సైట్లలో సెప్టెంబర్ 4న సేల్ మొదలవుతుంది. త్వరలో ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ ఫోన్ కొనొచ్చు.

  రెడ్‌మీ 9ఏ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.53 అంగుళాల హెచ్‌డీ+ డాట్ డ్రాప్ డిస్‌ప్లే

  ర్యామ్: 2జీబీ, 3జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ25

  రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+మెమొరీ కార్డ్

  కలర్స్: మిడ్‌నైట్ బ్లాక్, నేచర్ గ్రూన్, సీ బ్లూ

  ధర:

  2జీబీ+32జీబీ- రూ.6,799

  3జీబీ+32జీబీ- రూ.7,499

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Redmi, Smartphone, Xiaomi

  ఉత్తమ కథలు