హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi 9 Prime: రూ.10,000 లోపే రెడ్‌మీ 9 ప్రైమ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

Redmi 9 Prime: రూ.10,000 లోపే రెడ్‌మీ 9 ప్రైమ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

Redmi 9 Prime: రూ.10,000 లోపే రెడ్‌మీ 9 ప్రైమ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు
(image: Redmi India)

Redmi 9 Prime: రూ.10,000 లోపే రెడ్‌మీ 9 ప్రైమ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు (image: Redmi India)

Redmi 9 Prime | రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది షావోమీ. ధరతో పాటు స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రూ.10,000 లోపే మరో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది షావోమీ. రెడ్‌మీ 9 ప్రైమ్ మోడల్‌ను రిలీజ్ చేసింది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 5,020 భారీ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ లాంటి ప్రత్యేకతలున్నాయి. బాక్సులో 10వాట్ ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే 18 వాట్ ఛార్జర్ వేరుగా తీసుకోవాలి. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో రెడ్‌మీ 9 ప్రైమ్ రిలీజైంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా ఆగస్ట్ 6 ఉదయం 10 గంటలకు సేల్ మొదలవుతుంది. అమెజాన్ ఇండియా యాప్, వెబ్‌సైట్లతో పాటు షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు.

  రెడ్‌మీ 9 ప్రైమ్ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.53 ఫుల్ హెచ్‌డీ+

  ర్యామ్: 4జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ80

  రియర్ కెమెరా: 13+8+5+2 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 8మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,020ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: ఓషియన్ బ్లూ, మింట్ గ్రీన్, సన్‌రైస్ ఫ్లేర్, మ్యాటీ బ్లాక్

  ధర:

  4జీబీ+64జీబీ- రూ.9,999

  4జీబీ+128జీబీ- రూ.11,999

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Android 10, Redmi, Smartphone, Xiaomi

  ఉత్తమ కథలు