• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • REDMI 9 POWER 6GB RAM 128GB STORAGE VARIANT TO RELEASE SOON KNOW PRICE AND SPECIFICATIONS SS

Redmi 9 Power: రెడ్‌మీ 9 పవర్ కొత్త వేరియంట్ త్వరలో రిలీజ్... ప్రత్యేకతలివే

Redmi 9 Power: రెడ్‌మీ 9 పవర్ కొత్త వేరియంట్ త్వరలో రిలీజ్... ప్రత్యేకతలివే

Redmi 9 Power: రెడ్‌మీ 9 పవర్ కొత్త వేరియంట్ త్వరలో రిలీజ్... ప్రత్యేకతలివే (ప్రతీకాత్మక చిత్రం)

Redmi 9 Power New Variant | రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ రిలీజ్ కాబోతోంది. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    భారీ బ్యాటరీతో షావోమీ నుంచి గతేడాది డిసెంబర్‌లో రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ రిలీజైన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్‌లో రిలీజైంది. ఈ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్ రాబోతోంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌తో Redmi 9 Power రిలీజ్ చేస్తామని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అమెజాన్‌లో బ్యానర్ కూడా కనిపిస్తోంది. ఇప్పటికే రూ.12,000 లోపు సెగ్మెంట్‌లో రెడ్‌మీ 9 పవర్ బాగా పాపులర్ అయింది. కాకపోతే 6జీబీ వేరియంట్ లేదు. 6జీబీ వేరియంట్‌తో రెడ్‌మీ 9 పవర్ కొనాలనుకునేవారికి ఆప్షన్ లేదు. అందుకే 6జీబీ+128జీబీ వేరియంట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయాలని షావోమీ నిర్ణయించింది. త్వరలోనే రెడ్‌మీ 9 పవర్ 6జీబీ+128జీబీ వేరియంట్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది.

    రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.12,999 ఉండొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్, Mi.com వెబ్‌సైట్లలో కొనొచ్చు. ఎంఐ హోమ్స్, ఎంఐ స్టూడియోస్, ఎంఐ స్టోర్స్‌లో కూడా ఈ ఫోన్ లభిస్తుంది. ఇప్పటికే రెడ్‌మీ 9 పవర్ రియల్‌మీ నార్జో 20, సాంసంగ్ గెలాక్సీ ఎం11, వివో వై20, ఒప్పో ఏ53 లాంటి మోడల్స్‌కు పోటీ ఇస్తోంది.

    Realme X7 Pro 5G: రూ.29,999 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.13,000 లోపే కొనండి ఇలా

    Moto E7 Power: భారీ బ్యాటరీతో మోటో ఈ7 పవర్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.7,499 నుంచి

    గతేడాది డిసెంబర్‌లో రిలీజ్ అయిన రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్‌ఫోన్ బాగా పాపులర్ అయింది. మొదటి సేల్‌లో కేవలం 30 సెకన్లలో స్టాక్ మొత్తం అమ్ముడుపోయినట్టు షావోమీ ఇండియా ప్రకటించింది కూడా. రెడ్‌మీ నుంచి 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్ ఇది. భారీ బ్యాటరీతో పాటు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డ్రాప్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

    WhatsApp Groups: వాట్సప్ గ్రూప్స్‌లో మిమ్మల్ని ఎవరూ యాడ్ చేయకుండా ఈ సెట్టింగ్స్ మార్చండి

    WhatsApp New Features: యూజర్లకు అలర్ట్... వాట్సప్‌లో రాబోయే కొత్త ఫీచర్స్ ఇవే


    రెడ్‌మీ 9 పవర్ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.53 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డాట్ డ్రాప్ డిస్‌ప్లే
    ర్యామ్: 4జీబీ, 6జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 12
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫీరీ రెడ్, మైటీ బ్లాక్
    ధర:
    4జీబీ+64జీబీ- రూ.10,999
    4జీబీ+128జీబీ- రూ.11,999
    6జీబీ+128జీబీ- రూ.12,999
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు