హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi 9: రెడ్‌మీ 9 వచ్చేసింది... తక్కువ ధరకే 4GB+128GB స్మార్ట్‌ఫోన్‌తో షావోమీ సంచలనం

Redmi 9: రెడ్‌మీ 9 వచ్చేసింది... తక్కువ ధరకే 4GB+128GB స్మార్ట్‌ఫోన్‌తో షావోమీ సంచలనం

Redmi 9: రెడ్‌మీ 9 వచ్చేసింది... తక్కువ ధరకే 4GB+128GB స్మార్ట్‌ఫోన్‌తో షావోమీ సంచలనం
(image: Xiaomi India)

Redmi 9: రెడ్‌మీ 9 వచ్చేసింది... తక్కువ ధరకే 4GB+128GB స్మార్ట్‌ఫోన్‌తో షావోమీ సంచలనం (image: Xiaomi India)

Redmi 9 | రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రూ.10,000 లోపే 4GB+128GB స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ చేసింది షావోమీ. రెడ్‌మీ 9 మోడల్‌ను ఇండియన్ మార్కెట్‌లో రిలీజ్ చేసింది.

    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన షావోమీ... మరో సంచలనం సృష్టించింది. గతేడాది 4జీబీ+64జీబీ వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.10,000 లోపు పరిచయం చేసిన షావోమీ... అదే ట్రెండ్ కొనసాగిస్తోంది. రూ.9,999 ధరకు రెడ్‌మీ 9 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+128జీబీ వేరియంట్ రిలీజ్ చేసింది. రెడ్‌మీ 9 సిరీస్‌లో వచ్చిన 5వ స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 9, రెడ్‌మీ నోట్ 9 ప్రో, రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్, రెడ్‌మీ 9 ప్రైమ్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రెడ్‌మీ 9 మోడల్‌ను పరిచయం చేసింది. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 13 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్ ఓవర్ వైఫై-VoWiFi ఫీచర్ ఉండటం మరో విశేషం. రెడ్‌మీ 9 ప్రారంభ ధర రూ.8,999. ఆగస్ట్ 31న మొదటి సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్‌తో పాటు షావోమీ ఇండియా వెబ్‌సైట్‌లో కొనొచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా రెడ్‌మీ 9 లభిస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన రియల్‌మీ సీ12, రియల్‌మీ సీ15 స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది రెడ్‌మీ 9.

    Realme C15 vs Realme C12: రూ.10,000 లోపు రిలీజైన ఈ రెండు ఫోన్లలో ఏది బెస్ట్... తెలుసుకోండి

    Realme 7: రియల్‌మీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్... రియల్‌మీ 7 రిలీజ్ డేట్ ఫిక్స్

    రెడ్‌మీ 9 స్పెసిఫికేషన్స్

    డిస్‌ప్లే: 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే

    ర్యామ్: 4జీబీ

    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128

    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ35

    రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్

    ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్

    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్

    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+ఎంఐయూఐ12

    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్+ఎస్‌డీ కార్డ్

    కలర్స్: స్పోర్టీ ఆరెంజ్, స్కై బ్లూ, కార్బన్ బ్లాక్

    ధర:

    4జీబీ+64జీబీ- రూ.8,999

    4జీబీ+128జీబీ- రూ.9,999

    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AMAZON INDIA, MIUI 12, Redmi, Smartphone, Xiaomi

    ఉత్తమ కథలు