Amazon Offer | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే శుభవార్త. బడ్జెట్ ధరలో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. చౌక ధరకే మీరు ఈ ఫోన్‌ను (Phone) సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న అమెజాన్‌లో (Amazon) కళ్లుచెదిరే డీల్ లభిస్తోంది. రెడ్‌మి 12సీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అందువల్ల కొత్త ఫోన్ కొనే ప్లానింగ్‌లో ఉన్న వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.
రెడ్‌మి 12సీ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 8,999గా ఉంది. సాధారణంగా అయితే ఈ ఫోన్ ఎంఆర్‌పీ రూ. 13,999గా ఉంది. అంటే మీకు ఇప్పుడు 36 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొంటే రూ. 500 డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీరు ఈ ఫోన్‌ను రూ. 8,500కే కొనుగోలు చేసినట్లు అవుతుంది.
రూ.36,990 స్మార్ట్‌టీవీ రూ.8 వేలకే.. సున్నా వడ్డీతో రూ.1400 ఈఎంఐతో కొనండి!
అంతేకాకుండా ఈ ఫోన్‌పై మరో ఆఫర్ కూడా ఉంది. ఎక్స్చేంజ్ డీల్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 8,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ లభిస్తోంది. అంటే మీరు కేవలం రూ. 499 చెల్లించి పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తించుకోవాలి. మీ పాత ఫోన్ ఆధారంగా ఎక్స్చేంజ్ విలువ మారొచ్చు. మీ ఫోన్‌కు తక్కువ ఎక్స్చేంజ్ విలువ కూడా రావొచ్చు. అప్పుడు మీరు చేతి నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.
రోజుకు రూ.5 ఖర్చు.. నెలంతా ఉచితంగా మాట్లాడుకోవచ్చు, 10 జీబీ డేటా ఫ్రీ.. రీచార్జ్ ప్లాన్ అదిరింది!
అంతేకాకుండా ఈ ఫోన్‌పై తక్కువ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. నెలవారీ ఈఎంఐ రూ. 430 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 566 చెల్లించాలి. ఇక ఏడాది టెన్యూర్ అయితే రూ. 816 కట్టాలి. 9 నెలలు అయితే రూ. 1068 చెల్లించాలి. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా ఉంది. ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1500 పడుతుంది. మూడు నెలల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 4 వేలు చెల్లించాల్సి వస్తుంది. బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా కూడా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Amazon offers, Latest offers, Mobile offers, Smartphone, Telugu news, Telugu varthalu